పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : వడిఁ దప్పించి

కం||
డిఁ దప్పించి కరీంద్రుఁడు
నిడుదకరం బెత్తి వ్రేయ నీరాటంబుం
బొ వడఁగినట్లు జలములఁ
డి కడువడిఁ బట్టెఁ బూర్వదయుగళంబున్.
బాహ్య|| - గజము మకరముయొక్క వేగమును దప్పించుకొని తొండముచేఁ గొట్టఁగా నక్రము పొడవడఁగి (మరణించి) నట్లు నీటి యందుఁ గూలి మఱల, నుద్రేకించి ముందరి పాదంబులఁ బట్టె నని తాత్పర్యము.
రహ|| -నిడుదకరంబనగా "శ్లో|| ద్వౌక్రమౌ చిత్తనాశస్య యోగోజ్ఞానంచరాఘవ -యోగోహి చిత్తరోధశ్యాత్ - జ్ఞానంసమ్య గవేక్షణం" ఓ శ్రీరామచంద్రా। చిత్తనాశనమునకు యోగ, జ్ఞానములను రెండుమార్గములు కలవుఁ యోగమువలన చిత్తనిరోధమును, జ్ఞానము వలన సమ్యగ్వివేకంబును కలుగును. వానిలో "జ్ఞానాదేనహికైవల్యం" జ్ఞానమువల్లనే మోక్ష మను వాక్యముచొప్పున జ్ఞానము శ్రేష్ఠము, అదియే నిడుదకరము, దానిచేననగా, (వస్తువిచారకేన, కామోహతః) వస్తు విచారణచేఁ గామము నశించునను యుక్తి చొప్పున నాత్మానాత్మ వివేకముచేఁ, గామోద్రేకము నడంచఁగా గామము శాంతిబొందిఁనటు లగుపడినను, అనగా మార్జాల వ్యాఘ్రాదులు జంతువును బట్టుటకుఁబ్రయత్నించినపుడు, క్రోడీఁ (సూక్ష్మ) భావమును బొంది జంతుగ్రహణ సమయమునఁ దనుత్వము (విస్తృతము) నొందినట్లు కామము, జప, తప, యోగ, విచారణవేళలయందు జయింపఁబడిన దను ధైర్యము కలిగిఁనను
శ్లో|| తతోన్యధా కించనయద్వి పక్షతః
పృధగ్దృశస్తత్కృత రూపనామభిః
నకర్హిచిత్క్వా పిచదుస్ధితామతి
ర్లభేత వాతాహత నౌరివాస్పదమ్||
తా|| దృక్స్వరూపము ఆత్మనుండి కించిదత్తయినను విపక్షమైన, దృశ్యరూప మాయాకార్యము లగు నామరూపములతోడ నేకీభవించిన యెడల, నెప్పటికిని నెవని చేతను దుస్థిత మైన యీ చిత్తము వాయువుచేఁ గొట్టఁబడిన నావవలె స్వస్థానమును జెందనేరదు.
శ్లో|| ఇంద్రియాణాం హిచరతాంయన్మ నోను విధీయతే
తదస్యహార తిప్రజ్ఞాం వాయుర్నానమి వాంభసి||
చరించుచున్న యింద్రియములలో, నే యింద్రియమును, మనం బనుసరించునో, యా యింద్రియము సముద్రమున వాయువుచేఁ గొట్టఁబడిన నావవలెఁ (బ్రజ్ఞను నాకర్షించును)
మ||
అనిశంబున్ బరమాత్ముఁజూడని యతుం డాకార వైకారికా
జనవాంఛా విషయంబులన్ దవిలి, దు*స్సంసార సంచారము
ల్గోని ముందున్ దలయెత్తలేక బ్రతిమా*లున్ గన్నవార్నెల్లఁగా
వునదుస్సంగ విరోధి కావలయు, జీ*వుఁ డాత్మ సత్సంగియై
శ్లో|| లక్ష్యచ్యుతం చేద్యది చిత్తమీష
ద్బహిర్ముఖం. సన్నిపతేత్తతస్తతః
ప్రమాదతః ప్రచ్యుత కేళికందుక
స్సోపానపంక్తౌపతితో యధాతధా||
చిత్తము లక్ష్యము (బ్రహ్మము) నుండి, కించిత్తైననుఁ బహిర్ముఖ మైన యెడల, నాటబంతి ప్రమాదవశమున సౌథాగ్రము నందలి ప్రథమ సోపానముపైఁ బతన మైన నచ్చోట నిలువకఁ గ్రిందమెట్టువరకు, గళితమై యెట్లు భూపతనమగునో యట్లు చిత్తము ప్రపంచాభిముఖ మైన యెడల భ్రష్టత్వము నొందును - కావున లక్ష్యమును విడువగూడ దని భావము.