పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఊహ గలంగి

ఉ||
గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోలతా నిబద్ధపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేముఁ బొందు దేహి క్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రా దురంత దంత పరిట్టిత పాదఖురాగ్ర శల్యమై.
బాహ్య|| -గజముయొక్క స్థితిని సంస్కృతి (సంసారము) చే బీడింపఁబడిన, గృహస్థునివలెఁ బోల్చి చెప్పుచున్నా డెట్లనగాఁ బెక్కు సంకల్పములచే, జిత్త చాంచల్యముఁ గలిగి కుటుంబ రక్షణార్ధ మయి పెక్కు ప్రయత్నములు సేయుచు మోహములనుండి విడివడ సమర్ధుండుగాక, సంశయాత్ముఁ డగు గృహస్థుని వడువున, మొసలి యొక్క విశాల కరాళదంతములచే దృఢముగాఁ బట్టువడి శల్యావశిష్టవ మగు డెక్కలతోఁ గూడిన పాదములు కలదియై ఖిన్నతచే గజముండె నని తాత్పర్యము. (కరాళ - భయంకరమగు)
రహ|| -జీవుఁ డవిద్యా కార్య మగు కామ పరవశుఁడై యూహలు (గొంతెమ్మ కోర్కెలు)చేఁ గలతనొంది జీవనపుటోలము *జననమరణ ప్రవాహమునంబడి, యనగా, "కృతంమయాధికం పుణ్యం యజ్ఞదానాది నిశ్చితం - స్వర్గంగత్వాసుఖం భోక్ష్యే ఇతిసంకల్పవాన్ భవేత్" యజ్ఞదానాదికములచే గల్గు పుణ్యము నాచరించితిని, స్వర్గసుఖము ననుభవించెద నని సంకల్పించుచున్నాడు. ఇటు, లుపాధిగతుఁ డైన జీవుఁ డసంఖ్యాకము లైన జన్మము లొందుచున్నాడు.
శ్రు|| నానాయోని సహస్రాణిదృష్ట్వాచైవ తతోమయా - ఆహారావివిధాభుక్తాః పీతాశ్చవివిధాస్తనాః|| "వేలకొలఁది జన్మము లెత్తితిని, వివిధములగు స్తన్యపానములను జేసి, యాహారములను గ్రహించితిని, యిట్టి జననమరణ ప్రవాహమునం బడి, పోరుచుండియు, (దుఃఖించుచుండియు)" మహామోహలతానిబద్ధ పదము న్విడిపించుకొనంగలేక" "మోహాంధకార భయకూపనిపాతి తస్య" మోహము - స్వపరజ్ఞాన విహీనాంధకారకూపము.
శో|| అగాధేత్ర సంసార పంకేనిమగ్నం - కళత్రాదిభారేణ
ఖన్నంనితాంతం - మహామోహపాశౌఘబద్ధం
చిరాన్మాం సముద్ధర్తుమంబత్వ మే కైవశక్తా"||
అగాధమైన సంసార పంకమునందుఁగూరుకుపోయి కళత్రాది సంరక్షణభారముచే, ఖిన్నుఁడనై మోహపాశములచే బద్ధుఁడనగు నన్ను రక్షించుటకు నీవే తగుదువు తల్లీ!
శ్రు|| అహంకారసుతంవిత్త*భ్రాతరం మోహమందిరం
ఆశాంపత్నీంత్యజేద్యా వ*త్తావన్ముక్తోనసంశయః||
తా|| అహంకారమే పుత్రుఁడు, ధనమే సోదరుఁడు, మోహమే మందిరము, ఆశయే పత్నిగా గల యీ యంత స్సంసారము నెంతవఱకు విడువఁడో, యంతదనుక ముక్తి నొందఁడు. అనగా నెప్పుడు విడుచునో యపుడే ముక్తి కలుగును, సంశయము లేదు.
శ్లో|| యదాతే మోహకవిలం*బుద్ధిర్వ్యతి తరిష్యతి
తదాగంతాసి నిర్వేదం *శ్రోతవ్యస్యశ్రుతవ్యచ
తా|| ఎపుడు నీ (అర్జునుని) బుద్ధి మోహ కాలుష్యముఁ బొందక యుండునో, యపుడే వైరాగ్యము నొంది యిదివఱకు విన్నదానికి నిటుపైన వినవలసినదానికిని ఫలమును బొందుదు విట్లు పెక్కులు శ్రుతి స్మృతీతిహాసములు మోహమే సంసృతి హేతువగు నని, నిర్దిష్టితమై యున్నవి. కావున నట్టి మోహలతాబద్ధుఁడై సందేహాస్పదుఁ డైన గృహస్ధువలె, భయంకర మగు కామము యొక్క దుస్సంకల్ప వికల్పములగు దంతములచే జీవుని యొక్క వైరాగ్యాది పాదముల, శల్యావశిష్ట మగు నట్లు, కామముచే జీవుఁడు గ్రహింపఁబడి యుండె నని తాత్పర్యము.