పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తొండంబుల మదజలవృత

కం||
తొండంబుల మదజలవృత
గండంబులఁ గుంభములను ట్టన చేయం
గొంలు దలక్రిందై పడు
బెండుపడున్ దిశలు చూచి బెగడున్ జగముల్.
బాహ్య।-. తొండములచే గండస్థలంబుల ఘట్టనసేయునపుడు తధ్వనులకుఁ గొండలు బ్రద్దలై పడుట దిశలు ప్రతిధ్వనులిచ్చుటలు వీక్షించి లోకములు భయముఁ జెందె నని తాత్పర్యము (అతిశయోక్తి)
రహ|| - - ఆజ్ఞాచక్రమను గండస్ధలమునందు మదజల-మదించిన చలము-పట్టుదల యనగాఁ గర్తృకాద్యహంభావమును, (తొండము) ఉచ్ఛ్వాస (ప్రాణాయామము)చే ఘట్టన నిరోధము సేయుచుండునపుడు (జగములు) శరీరము గగురుపాటుఁబొందె నని భావము. అహంభావముచే జీవుఁ డింద్రియ వ్యాపారములకు నాజ్ఞ నిచ్చు స్థాన మాజ్ఞాచక్రము-