పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తేటి యొకటి

కం||
తేటి యొకటి యొరు ప్రియకును
మాటికి మాటికిని నాగ దజల గంధం
బేటి కని తన్నుఁ బొందెడి
బోటికి నందిచ్చు నిండు బోఁటు దనమునన్.
బాహ్య|| -ఒకతుమ్మెద వేఱొక ప్రియురాలికి యూమదజల గంధలేశము నీకేల నని జాణతనమునఁ దన్నుఁ బొందెడి బోటికిఁ దాను గ్రహించినది యిచ్చె నని తాత్పర్యము-
రహ|| - - మనస్సు సమాధియందుండు ఆనందమును మఱఁగి జగదాకార వృత్తులను, వదలి సంప్రజ్ఞాత సమాధియందలి యానందముఁ బొందె నని తాత్పర్యము. -
కం||
అంగీకృత రంగ న్మా
తంగీ మదగంధ మగుచు ద్దయు వేడ్కన్
సంగీత విశేషంబుల
భృంగీగణ మొప్పె మ్రానుపెట్టెడి మాడ్కిన్.
బాహ్య|| -. సంచలించుచున్న తుమ్మెదల గుంపు మాతంగుల(గజముల)యొక్క మదగంధమును శరీరముల యందలముకొని, నిశ్చేష్టత్వమును - గలుగఁజేయునట్టి, గానవిశేషములచే నొప్పె నని తాత్పర్యము
రహ|| - హృత్పద్మముల యందుండు సంకల్పములను, తుమ్మెదల గుంపులు, "తృష్ణా హృత్పద్మషట్పదీ" (తృష్ణ - హృత్పద్మముల యందలి తుమ్మెద) మాతంగీ యనఁగా బరాప్రకృతి సంబంధమైన నిర్వికల్పానందముచే, నిశ్చేష్టముగాఁ బ్రణవధ్యానముఁ జేసె నని తాత్పర్యము.
కం||
ల్లభలు పాఱి మునుపడ
ల్లభ మని ముసరి రేని వారణదానం
బొల్లక మధుకరవల్లభు
లుల్లంబులఁ బొందిరెల్ల యుల్లాసంబుల్.
బాహ్య|| - - పరుగులిడి వచ్చు ప్రియురాండ్రను- మధపములు ప్రేమచేఁ జుట్టుకుని గజగంధమును గైకొనక బలు విధములగు ఆనందములను పొందినవి.
రహ|| - జీవుఁ లవిద్యోపాధులతోఁగలసి పృధక్కుగానుండు గజగంధమును (విషయానందమును) గైకొనక సహజానందమును తాదాత్మ్యానందమును బొంది రని తాత్పర్యము.