పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తాటంకాచలనంబుతో

వ॥ అని తర్కించుచు.
శా॥
తాటంకాచలనంబుతో; భుజనటద్ధమ్మిల్లబంధంబుతో;
శాటీముక్త కుచంబుతో; నదృఢచంత్కాంచితో; శీర్ణలా
లాటాలేపముతో; మనోహరకరాగ్నోత్తరీయంబుతోఁ;
గోటీందుప్రభతో; నురోజభర సంకోచద్విలగ్నంబుతోన్.
బాహ్య॥ (లక్ష్మీదేవిని వర్ణించుచున్నాడు) చలించుచున్న కర్ణభూషణములును - భుజములపై నటించుచున్న కేశబంధమును - చీరచేఁ గప్పఁబడిన వక్షోరుహములు గలిగినట్టియు - వదులుగా నున్న మొలనూలు(ఘంటల యొడ్ఢాణము) గలిగినట్టియు - వట్టివేరు గంధంబుతో తస్కరింపఁ బడిన ఫాలబాగము గలిగినట్టియు - చేతులలో నిమిడి యున్న పైటచెంగు గలిగి నట్టియు - యురోభర విలగ్న మనగా దద్భారముచే నూగులాడు నడుము కలిగినదై లక్ష్మి యడుగుట కూహించె నని తాత్పర్యము.
రహ॥ సూర్యచంద్రులను శ్రవణభూషణములును - జీవేశ్వరులను కుచయుగ్మమును - అభిమానమును శాటియును - మణిపూరచక్రమను వడ్ఢాణమును - నేతి నేతి వాక్యములచే శేషించిన నడుము కలిగినదియై ప్రకృతి యడుఁగుటకుఁ బ్రయత్నించె నని తాత్పర్యము.