పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తన వేంచేయు పదంబుఁ

మ॥
వేంచేయు పదంబుఁ బేర్కొనఁ; డనాస్త్రీ జనాలాపముల్
వినెనో? మ్రుచ్చులు మ్రుచ్చలించిరొ ఖలుల్ వేదప్రపంచంబులన్?
నుజానీకము దేవతానగరిపై దండెత్తెనో? భక్తులం
ని చక్రాయుధుఁ డేఁడి చూపుఁ డని ధిక్కారించిరో? దుర్జనుల్.
బాహ్య॥ - ఇట్లు విష్ణువుచే నాకర్షింపఁబడు చేలాంచలియై లక్ష్మి తనలో నిట్లు చింతించె, నెచ్చటకుఁ జనుచున్నాడో, యాతురపాటుచేఁ జెప్పఁ డయ్యెను - అనాథస్త్రీ (ద్రౌపది మొదలగు) జనాలాపంబు లాలించెనో, వేదసమూహములను స్తేనులు (చోరులు) మ్రుచ్చిలించిరో - లేక దైత్యులు దివిజులపై దండెత్తిరో - దుర్జనులు చక్రహస్తునిఁ జూపు మని బాధించిరో - యేదో దుర్భరము సంభవించి యుండును - కానిచో నింత యాతృత యెట్లు సంభవించు నని తలంచెను.
రహ॥ ఇట్లు పరమాత్మచే నాకర్షింపఁబడిన పరాప్రకృతి యిట్లు చింతించెను. అవిద్యచే నాకర్షింపఁబడు విద్యాలాపము వినెనో లేక వేదము, లపౌరుషేయములు కావని వేదబాహ్యులు ప్రబలిరో, యాసురసంపత్తి - దైవసంపత్తిని మొనచూపకుండా నావరించెనో - పరోక్షా పరోక్షజ్ఞానమే లేదని భక్తులకు దుర్భోదముఁ జేసినో యని చింతించె నని తాత్పర్యము.