పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : తమముం బాసిన

మ॥
ముం బాసిన రోహిణీవిభు క్రియన్ ర్పించి సంసారదుః
ము వీడ్కొన్న విరక్తచిత్తుని గతిన్ గ్రాహంబు పట్టూడ్చి పా
ము లల్లార్చి కరేణుకావిభుఁడు సౌంర్యంబుతో నొప్పె సం
భ్రదాశాకరిణీ కరోజ్ఝిత సుధాంస్స్నాన విశ్రాంతుఁడై.
బాహ్య॥ గజేంద్రుఁడు మొసలియొక్క పట్టు వీడినవాఁడై పాదములు విదలించి విచ్ఛిన్న మేఘమునుండి వెలువడిన చంద్రుని మాడ్కిని సంసారదుఃఖ జనిత విరక్తిచే విముక్తి నొందిన సంసారి చాడ్పునను - దిగ్గజముల యొక్క కరము(తొండము)లచేఁ దడుపఁబడుచున్న సుధాంభ స్నాన విశ్రాంతుఁడై యానందముచే నొప్పె నని తాత్పర్యము. -
రహ॥ జీవుఁడు కామము యొక్క పట్టువీడి రాహుగ్రహవిముక్త చంద్రుని వడువునను - సంసారబంధ విముక్త విరక్తుని చందమునను - పరాకాశ (దిగంతములనుండి) సహజానందామృత ధారలచే నిమజ్జితుడై స్వస్వరూపానందుఁడై సుఖముగా నుండె నని తాత్పర్యము.
- - । సంపూర్ణము. -।
గజేంద్రుండు పూర్వ మింద్రద్యుమ్నుం డను ధరణీవిభుండు వైష్ణవభక్తుండు, పర్వతాగ్రంబునఁ దపంబుఁ సేయచుండ నచ్చోటికి నగస్యమునివర్యుం డేతెంచిన నా ఋషివర్యుని గౌరవముసేయక నిర్లక్షించిన - నాతండు - కరివై జన్మింతువుగాక యని శాపం బిచ్చిన నా రాజు కరియై జన్మించెను. విష్ణుభక్తుఁడైన కతనఁ దద్విష్ణుచే రక్షింపఁబడెను. మొసలి హూహూ యను గంధర్వుఁడు; దేవలఋషి శాపవశంబున మకరమై జన్మించి విష్ణుచక్రముచే శాపవిమోచన మయ్యెను.

శ్లో॥ నమస్తే శ్రీరామా। నియమిత గుణగ్రామసతతం
నమోభూయోభూయః పునరపి నమస్తే రఘుపతే
నమోవేదైర్వేద్యాఖిలమునిగణారాధ్యభగవన్నమో
భూయోభూయస్తవచరణ పంకేరుహయుగే॥
శ్లో॥ అంజనానందనంవీరం-జానకీశోకనాశనం
కపీశమక్షహంతారం-వందేలంకాభయంకరం॥
-- ~~~ --