పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ

మ||
పృథుశక్తిన్ గజ మా జలగ్రహముతోఁ బెక్కేండ్లు పోరాడి సం
శిథిలంబై తన లావు వైరిబలముం జింతించి మిథ్యామనో
మిం కేటికి? దీని గెల్వ సరి పోరం జాలరా దంచు స
వ్యమై యిట్లనుఁ బూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్.
బాహ్య|| ద్విరదము నీరాటముతోఁ బెక్కు హయనంబులు, మొనరించి, క్షీణించిన బలముఁ గలదియై స్వపర బలాబలములఁ దలపోసి, గెల్చుట వ్యర్ద మనో రాజ్య మని పూర్వపుణ్య భాగ్యముచే బాధను సరకుఁజేయక తనలో నిట్లు చింతించెను.
రహ|| జీవుఁడు, కామముతో నధిక కాలము (అనేకజన్మలు) పోరి జితుఁడై, సాధించుట యసాధ్య మని యెంచి, కామము మోహబీజ నంజనితం బని, నిస్పృహుండై, పూర్వ సద్వాసనా పుణ్యవశమున నిట్లు చింతించెను. విను మోహబీజ సంజనితంబు కామంబు