గజేంద్రమోక్షణ రహస్యార్థం : పదములఁ బట్టినం
చ||
పదములఁ బట్టినం దలకుబా టొకయింతయు లేక శూరతన్
మదగజవల్లభుండు ధృతిమంతుఁడు దంతయుగాంత ఘట్టనం
జెదరఁగఁ జిమ్మె న మ్మకరిచిప్పలు పాదులు దప్పనొప్పఱన్
వదలి జలగ్రహంబు కరివాలముమూలముఁ జీరెఁ గోఱలన్.
బాహ్య|| - ఇట్లు (మకరిచే) పాదములం గ్రహింపఁబడి, గజము వెనుదీయక. ధైర్యముచే దంతములతో నమ్మకరి చిప్పలు (శరీరముగా నేర్పడిన పొలసులు) మొదలంటఁ గొట్టగా, మొసలి బిగువుఁ దప్పించుకొని వనాటము (గజము) యొక్క పుచ్ఛమును బలుచోట్ల నఖములతోఁ జీరె నని తాత్పర్యము.
రహ|| జీవుఁడు కామముచేఁబట్టువడి మైమఱపులేక
శూరుఁడయి యనగా.
చ|| అరదము దేహమింద్రియము, *లశ్వము లాత్ముఁడుసూతు. డిమ్మహా।
తుర గచయంబు ధైర్యమును. తోరపు బగ్గములందృఢంబుగా*
నురువడిఁబోవకుండ వెఱ*వొప్పఁగ బట్టినవాఁడు స్వర్గవుం।
దెరువునఁబోవునమ్మ హిత - ధీరుఁడు నుమ్ము మహాత్ముఁడయ్యెడన్
అట్టి ధైర్యదంతయుగము (భక్తి జ్ఞానములు)చేఁ గామమును "సంకల్ప ఏవాఖిల కామమూలం" సమస్త కామములకు - సంకల్పమే మూలము. కామ మూలము లగు దుస్సంకల్ప చిప్పలను వాసనా క్షయ మగునటుల "కదా వామనోమే సమూలం వినశ్యాత్" నా మనస్సు సమూలము (వాసనా క్షయము) గా నెప్పుడు నశించునో, యట్లు వాసనా క్షయమగు నటులుఁ గామము, నణఁగ ద్రొక్కఁగా న క్కా మము. "ఆవృణోతితధామాయా ప్ర్రాజ్ఞంవాపిపరాజ్ఞ్ముఖం" సంసారాభిముఖుని, సరస్సు నందలి నాచువలె మాయ యావరించును. అట్లు కామ, మేమరుపాటులేక నింద్రుఁడు తన పినతల్లి దితి నిష్టఁ దప్పి తల విరియంబోసికొని, పశ్చిమ శిరస్సుగాఁ బరుండి నిద్రించునపుడు. గర్భములోఁ బ్రవేశించి పిండమును దునియలు చేసినట్లు జీవుఁని బుచ్ఛమనగా నానందమయకోశమునకు " బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠా" అట్టి బ్రహ్మవిచారణను, కామము (నఖములు) దుస్సంకల్పములచే జీవుని బాధించె నని తాత్పర్యము.