పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : మకర మొకటి

క॥
ర మొకటి రవిఁ జొచ్చెను;
రము మఱియొకటి ధనదు మాటున డాఁగెన్;
రాలయమునఁ దిరిగెఁడు
రంబులు కూర్మరాజు ఱువున కరిగెన్.
బాహ్య॥ మకరి మరణించినతోడనే, ప్రాణవాయువు లేచిపోయిన పిమ్మట వాయువు లన్నియు లేచిపోయినటు లా సరస్సులోని మకరములు లేచిపోయె నని మకరి పదమునకుఁ గల వివిధము లగు వివిధార్థములను స్వభావోక్తిగాఁ జెప్పంబడెను. - మఱియొకటి రవిఁ జొచ్చె ననగా మకరనామ లగ్నరాశి, సూర్యుఁడు గ్రహరాజగుటచే వాని ప్రక్కకుఁ బోయెను. మఱియొకటి ధనదు మాటున డాఁగెన్ గుబేరునకుఁ గల నవనిధులలో మకరనామనిధి వాని చెంతకుఁ బోయెను. మకరాలయ మనగా సరస్సు దానిలో సంచరించు మకరములు కూర్మరాజనగాఁ గూర్మనామక యుపవాయువు, దానికి రాజు ప్రాణము దానికి మడువు మనస్సు దాని యందుఁ జొచ్చిన వని తాత్పర్యము లేక కూర్మరాజు మడువు సముద్రము దానిలోఁ గలిసె నని యాశయం.
రహ॥ కామ మనగా నజ్ఞానము, రవిఁ జొచ్చెననగా "విద్యాzవిద్యాంనివర్తేత తేజస్తిమిర సంఘవత్" తేజస్సు తిమిరసంఘమును నశింపఁజేసినట్టు విద్య (జ్ఞానము), అజ్ఞానమును నశింపఁజేయును - "విద్యాదివాప్రకాశత్వాత్" విద్య యనగా - పగలు తదథి దేవత యగు సూర్యునిలో, గలిపెను. , మఱియొకటి ధనదుమాటున డాఁగెన్ - గుబేరుని మాటు - కైలాసము. నీశ్వరుని చెంత నైక్య మయ్యెను. , మకరాలయ మనగా మనస్సు నందలి సంకల్పములు - కూర్మరాజు - కూటస్థుఁడు, వాని, మడువనగాఁ బ్రకృతి లేక మాయ దాని యందైక్య మైన వని తాత్పర్యము.