పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : మదగజ దానామోదము

కం||
గజ దానామోదముఁ
లని తమకములఁ ద్రావి డుపులు నిండం
బొలుచుఁ దుమ్మెదకొదమల
దుపులు జుం జుమ్మటంచు గానము చేసెన్.
బాహ|| - ఏనుఁగుల యొక్క మదము (గండస్ధలము లందు స్రవించు మదము)ను - గుతుకులనిండఁ బానము జేసి మధపములు ఝంకారముఁ జేసిన వని తాత్పర్యము.
రహ|| - ఆజ్ఞాచక్రమునందు నాదాను సంధానందంబునఁ పారర్ధిక జీవమధుపము లానందించుచున్నవి.
శ్లో|| ఆజ్ఞాచక్రే భృకుటిస్ధానే ద్విదళాంతే
హంక్షం బీజం జ్ఞానమయంతం శివశక్తిం
నాదబ్రహ్మానంద మనంతం గురుమూర్తిం
దత్తాత్రేయం శ్రీపదపద్మం ప్రణతోస్మి
తా|| (హంక్షం అను బీజములు గల యాజ్ఞ యందు నాదము ప్రారంభ మగును. )