పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : లా వొక్కింతయు లేదు

శా||
లా వొక్కింతయు లేదు; ధైర్యము విలోలంబయ్యె; బ్రాణంబులున్
ఠావుల్ దప్పెను; మూర్ఛ వచ్ఛెఁ; దనువున్ స్సెన్; శ్రమంబయ్యెడిన్;
నీవే తప్ప నితఃపరం బెఱుఁగ; మన్నింపందగున్ దీనునిన్;
రావే! యీశ్వర! కావవే వరద! సంక్షింపు భద్రాత్మకా!
బాహ్య|| అట్లు గజ మంతరంగమున నీశ్వర సన్నిధానంబుం గల్పించుకొని యిట్లు ప్రార్ధించెను, నాకు బల మొక్కింతయును లేదు, ధైర్యము నశించినది. ప్రాణంబులు స్వస్థానంబులు దప్పినవి, స్మారకముఁ దప్పినది. శరీరము బడలినది, ఆయాస మయ్యె. నీవు తప్ప నా కేమియు నాధారంబు లేదు. కావున నో వరదా! సంరక్షింపుము, మంగళ స్వరూపా!
రహ|| జీవుఁ డట్లు మానసంబున నీశ్వర సన్నిధానంబుఁ గల్పించుకొని యనగా "మనఃకృతం కృతంకార్యం న శరీరకృతం కృతం"
తా|| " ఉత్తమం మానసం ప్రోక్త" మనునట్లు మనః కృతమగు కార్యమే నిజమైన కార్యముకాని శరీరకృతము నిజమైన కార్యము కానేరదు, కావున నీశ్వర సన్నిధానంబు (బ్రహ్మానుసంధానము) గల్పించుకొని యిట్లు ప్రార్ధించెను . "లావొక్కింతయులేదు" సత్వగుణ మొక్కింతయు లేదనగా "రజస్సత్వంత మశ్ఛైవ" రజస్సత్వ గుణముల నడఁగఁ ద్రొక్కి తమస్సు వృద్ధి యగుచున్నది. కావున సత్వగుణము లేశమైనను లేదు. "ధైర్యము విలోలంబయ్యె"
శ్రు|| శ్వోzభావామర్త్య స్వయదంత కైతత్సర్వేంద్రియాణాం జరయంతి తేజః" హే, అంతకా।విషయము లింద్రియములలో నుండు నధి దేవతా సంబంధమైన యాత్మ తేజస్సును నశింపఁజేయుచున్నవి. యనగా నాత్మ ధైర్యమను వృక్షము మోహ కల్లోలములచే నొడ్డు కరిగి కూలిపోయినది. "ప్రాణంబులా ఠావు ల్దప్పెను" పంచప్రాణములు స్వస్థానములు తప్పె ననగాఁ బశువులు బంధములను త్రెంచి సంభ్రమణ మొనర్చినట్లు విషయాభిముఖములై యష్టమైధునముల వెంబడి పఱుఁగు లిడినవి.
అష్టమైధునములు
శ్రు|| దర్శనం స్పర్శనం కేళిః కీర్తనం గుహ్యభాషణం
సంకల్పోzద్యవసాయశ్చక్రియా నిర్వృతిరేవతు ఏతన్మైధున మష్టాంగం ప్రవదంతి మనీషిణః||
1దర్శనం - చూచుట
2 స్పర్శనం - శరీరముఁదాఁకుట
3 కేళిః - కలిసి క్రీడించుట (ఆటలాడుట)
4 కీర్తనం - స్తోత్రము
5 గుహ్యభాషణమ్ - రహస్య సంభాషణ
6. సంకల్పః - తలంచుట
7. అధ్యవసాయః - ఉత్సాహము
8 క్రియానిర్వృతిః - కార్యనిర్వహణము

ఇట్టి యష్టమైధునములలో సంచారమే ప్రాణములు ఠావుల్దప్పుట మఱియు -మూర్చవచ్చె, మోహముచే స్మారకముఁ దప్పెను. తనువు (సూక్ష్మశరీరము) శ్రమనొందెను. కావున నీవే తప్ప ననగా బ్రహ్మ జ్ఞానము వినా వేరుమార్గముఁ గానకున్నాను.
శ్లో|| బోధోహి సాధనేభ్యోహి*సాక్షాన్మోక్షైకసాధనం
పాకస్య పహ్ని వజ్జ్ఞానం*వినామోక్షోనసిధ్యతి
జ్ఞానాదేనహి కైవల్యం"
తా|| మోక్షసాధనములలో బోధ (జ్ఞానము) ముఖ్యసాధనమై యున్నది. పాకమున కగ్నివలె, మోక్షమునకు జ్ఞానము ముఖ్యమై యున్నది. జ్ఞానమువల్లనే గదా మోక్షము ఇట్లు జ్ఞానోపదేశముఁ జేసి నీ (ఆత్మ)లో నైక్యముఁ జేసికొమ్మని జీవుఁడు ప్రార్ధించె నని యాశయము.
[క||
విను దఁట జీవుల మాటలు
ను దఁట చనరానిచోట్ల రణార్థుల కో
ను దఁట పిలిచిన సర్వముఁ
ను దఁట సందేహ మయ్యెఁ రుణావార్ధీ!]