పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : కరిఁ దిగుచు

కం||
రిఁ దిగుచు మకరి సరసికిఁ
రి దరికిని మకరిఁ దిగుచు రకరి బెరయన్
రికి మకరి మకరికిఁ గరి
మనుచును నతల కుతల టు లరుదు పడన్.
బాహ్య|| సరస్సులోనికి గజమును, దీరమునకు మకరిని నన్యోన్యాకర్షకములై జయము భరమని , తలంచుచుఁ దద్వయమును పాతాళ భూలోక భటులు (యుద్ధవీరులు) భయపడునట్లుఁ బోరుచున్నవి.
రహ|| జీవుఁడు తీరమున కనఁగా సంసార సాగరమున కావలియొడ్డు
శ్లో|| తీర్త్వా మో హార్ణవం హత్వం*కామక్రోధాదిరాక్షసాన్
యోగీశాంత సమాయుక్తో*ఆత్మారామో విరాజితేః
తా|| శాంత సమాయుక్తుఁడును, నాత్మారాముఁడు నగు యోగి, మోహ వారధిని దాటి కామాది దైత్యులను గూల్చి యానందమునుబొందుచున్నాడు - కావున నట్టి యానంద రూప తీరమునకు జీవుఁడున
శ్లో|| క్లేశాది పంచక తరంగయుతం భ్రమాడ్యం
దారాత్మ జాదిధన బంధు ఝషాభియుక్తమ్
ఔర్వానలాభ నిజరోషమనంగ జాలమ్
సంసార సాగరముతీత్యహరింవ్రజామి|| "
తా|| - పంచక్లేశములు 1 అవిద్యా క్లేశము దుఃఖరూపమైన యాత్మ (శరీరము) యందు సుఖరూప మగు నాత్మబుద్ధి 2 ఆస్మితా క్లేసశము - సశరీవ్యతిరిక్తమగు ఆత్మలేదను మూఢజ్ఞానము 3 రాగ క్లేశము - రాగము గల్గి వీడకుండుట 4 ద్వేషక్లేశము - ఫల విఫల సమయమునఁ బట్టు వృత్తి 5 అభినవక్లేశము - సంసార మసత్య మని విడువ లేకుండుట - యిట్లు పంచక్లేశయుక్తమము , భ్రమయును నావర్తము సుడి గలిగినదియు, దారావుత్ర ధనాదిక మీన యుక్తమును, రోషమను బడబానలము, విషమ వాంఛాసమూహము గలిగిన సంసార సముద్రమును (తరించి విష్ణువును పొందు చున్నాను,) అట్టి సంసృతి పారావారము (సరస్సు) లోనికిఁ గామమును దైవాసుర సంపత్తులలోని వీరభటులుఁ భయము జెందునట్లు యుద్ధముఁ జేయుచుండిరని తాత్పర్యము,