పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : కరిణీకరోజ్ఝిత

సీ||
రిణీకరోజ్ఝిత కంకణచ్ఛటఁ దోఁగి;
సెలయేటి నీలాద్రి చెలువుఁ దెగడు
స్తినీ హస్త విన్యస్త పద్మంబుల;
వేయిగన్నులవాని వెరవు చూపుఁ
లభసముత్కీర్ణ ల్హార రజమునఁ;
నకాచలేంద్రంబు నతఁ దాల్చు
గుంజరీ పరిచిత కుముద కాండంబుల;
ణిరాజ మండన ప్రభ వహించు
ఆ||
దకరేణు ముక్త మౌక్తిక శుక్తుల
మెఱుఁగు మొగిలుతోడ మేలమాడు
నెదురులేని గరిమ నిభరాజ మల్లంబు
నజగేహకేళి వ్రాలునపుడు.
బాహ్య|| - - అవారణ శ్రేష్ఠము సరస్సులో విహరించునప్పుడు. వేదందములు తొండములచేఁ బైకిఁజిమ్ముచున్న (కంకణచ్చట-నీటిబిందువుల వరుస, శరీరమునందుఁదోఁగి - (అటు గలసి) నీలపర్వతమును, బరిహసించు చున్నట్లును, ద్విరదంబులఁబట్టిన కమలములచే వేయి కన్నులవాని (ఇంద్రుని) మాడ్కిని - యెఱ్ఱకలువల పుప్పొడి వికాసముచేఁగనకాచలంబువలెను - దామరతూండ్లచే ఫణిరాజు వడువునను-మరియుఁగరిరాజుచే విడువఁబడిన ముత్యపుఁజిప్పలు మేఘములతోఁగ లియుచుండ నిట్లప్రతిహతముగా విహరించె నని తాత్పర్యము.
రహ|| - గజము, నీలాద్రి ప్రభృతి రూపంబులు బొందినట్లు జీవుఁడు మూలాధారాది చక్రములందు వాయువును, బంధించి నపుడాయా దేవతావర్ణములను బొంది (కరేణు విముక్త మౌక్తిక పంక్తులు) తుదకుఁ బర యందైక్యమయ్యె నని తాత్పర్యము

చక్రనామములు అధిదేవతలు వర్ణములు వర్ణబీజములు
మూలాధారము గణపతి పీత - పసుపు వ, శ, ష, స
స్వాధిష్ఠానము బ్రహ్మ రక్తవర్ణము బ, భ, మ, య, ర, ల
మణిపూరము విష్ణువు నీలవర్ణము డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ
అనాహతము శివుఁడు శ్వేతవర్ణము క, ఖ, గ, ఘ, ఞ, చ, ఛ, జ, ఝ
విశుద్ధము మాయాశక్తి నలుపువర్ణము స్వరములు (అచ్చులు) 16 అఆలు (అవ్యక్తము)
ఆజ్ఞ. పారమార్ధిక జీవుడు ఎరుపువర్ణము హం క్షం (కుంకుమ).
సహస్రారము శాంతకల శుద్దశ్వేతము ద్విజఈశ్వరుఁడు (రాజు).

వ|| మఱియు నాసరోవరలక్ష్మివిభవయై, యనంగవిద్యానిరూఢ పల్లవ ప్రబంధ పరికంపిత శరీరాలమకార యగు కుసుమ కోమలిఁబోలె వ్యాకీర్ణ చికుర మత్తమధుకర నికరయు. విగతరస వదనకమలయ, నిజస్థాన చలిత కుచరధాంగయుగళయు, లంపటిత- (శ్రమపడిన)
బాహ్య|| -మఱియు నా సరోవరము గజ విహారముచేఁ
గలఁకఁబాఱి నూత్నశోభాయుతమై, మదనవిద్యా ప్రవీణులైన పల్లవకోటిచేఁ(చిగురులను సరసులచే)
బరికంపిత శరీరాలంకారవతియగు, యువతింబోలినదియు, విరియంబోసిన భృంగములను, కేశములు గలదియుఁ, జలించుచున్న చక్రవాకములను కుచయుగళము, శ్రమయుక్తమైన వులిన (యిసుకతిన్నె) స్థలంబునుబోలు జఘనస్థలముఁ గలిగినదియు నై యుండె నని భావము.
రహ|| -మఱియు నా మానస సరస్సు, జీవన్ముక్తవిహారముచే, సద్వాసనా శోభితమై, (యనంగ)యుపాధిరహిత యాత్మజ్ఞాన, రసిక, భుజంగులగు, బ్రహ్మవిదాదులచే శుద్ధమై శబ్దరూపర సాదివుగతయై, కించజ్ఞత్వ, సర్వజ్ఞత్వాదిగుణలక్షణములుఁగల జీవేశ్వరులను స్తనద్వయ యుతయై యుండె నని తాత్పర్యము(బ్రహ్మవిదులు - బ్రహ్మవిత్ - నరఃవరీయఃవరిష్ఠ)