పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : కలుగఁడే నాపాలి

సీ||
లుగఁడే నాపాలిలిమి సందేహింపఁ;
లిమిలేములు లేకఁ లుగువాఁడు?
నా కడ్డపడ రాఁడె లి నసాధువులచేఁ;
డిన సాధుల కడ్డడెడువాఁడు?
చూడఁడే నా పాటుఁ జూపులఁ జూడకఁ;
జూచువారలఁ గృపఁ జూచువాఁడు?
లీలతో నా మొఱాలింపఁడే మొఱఁగుల;
మొఱ లెఱుంగుచుఁ దన్ను మొఱగువాఁడు?
గీ||
ఖిల రూపముల్ దనరూప మైనవాఁడు
దిమధ్యాంతములు లేక డరువాఁడు
క్తజనముల దీనుల పాలివాఁడు
వినఁడె? చూడఁడె? తలఁపడె? వేగ రాఁడె?
బాహ్య|| కలిమిలేము లెంచక సమముగా దర్శన మొసంగునట్టి వాఁడున్నాడో, లేడో, యని సందేహించుచున్న నా పాలి కలుఁగఁడా ? ఉండడా? దుర్మార్గులచే బాధింపఁ బడుచున్న సాధు సంరక్షకుఁడగు వాఁడు నా కడ్డపడఁడా ? పరాగ్దృష్టి (బహిర్దృష్టి)వీడి ప్రత్యగ్దృష్టుల (అంతరము) ను జూచువారిని గృఁప జూచునట్టి దైవము నా పాటు (కష్టము) జూడఁడా? మొఱలు వినుచున్నను (దిరోహితుఁడై) కనపడక యుండువాఁడు నా మొఱ వినలేదా? తానే యన్ని రూపములు ధరించిన వాఁడును ఆదిమధ్యాంతములు లేని వాఁడునుఁ భక్త, దీనాదిజనముల పాలిటి రక్షకుఁడైన వాఁడుఁ వినలేదా? చూడలేదా।
రహ|| కలిమి, లేములు " శ్రు|| నాసదాసీత్ నోసదాసీత్"
తా|| యేది సదసత్స్వరూపము కాదో, అనగా, న+సత్+ఆసీత్ - నా సదా శీత్
సీ|| సత్తుగా దాత్మవి *జ్ఞానంబుచే నెంద
భావమై బాధింపఁ బడుట వలన
నెలమిన సత్తుగా *దేనజ్ఞుఁడన టంచు
నజ్ఞానభూతమై *యలరుచునికి
సదసత్తుగాదు , వి * చారింపలే దట్టి
ద్రవ్యంబు గడువిరు *ద్ధంబు గాన
నిరనయవము గాదు *నిఖిల జగత్స్వరూ
పముచేత మిగులనే* ర్పడుట వలన
గీ|| సావయనమునుగాదు *దృశ్యము సుషుప్తి
యందడంగినఁదాను, శూ *న్యంబు గామి
నొరయ యుభయాత్మకముగా, ద *యుక్తమగుట
నాంజనేయ మదీయ మా *యూతమంబు||
తా|| ఇట్టి మాయాకార్య రూపమగు, కలిమి లేములు లేక, నేతినేతి వాక్యములచే నిషేధింపఁగా నవశేషుఁడగు, మిగిలినవాఁడు లేడా?అయితే యిన్ని స్వరూపములుగా నేల పరిణమించె ననగా?
శ్లో|| అవ్యక్తాహిగతిర్దుఖం *దేహ వద్భిరవాప్యతే||
తా|| దేహాత్మ బుద్ధులచే, నవ్యక్తోపాసన దుర్లభ్యముగదా। కావున సవికల్ప సమాధివల్లనే నిర్వికల్ప సమాధినిఁ బొందవలెను.
శ్లో|| జేతుంశక్యం మనోరాజ్యం* నిర్వికల్ప సమాధినానుసం పాద్యః క్రమాత్సోపి* సవికల్ప సమాధినా
తా|| మనోరాజ్యము (గొంతెమ్మకోరికలు) ను నిర్వికల్ప సమాధిచే జయింపవచ్చును. నా నిర్వికల్ప సమాధిని సవికల్పముచేతనే సంపాదింపవలయు ననగా, సగుణస్వరూప మగు నామ రూపాదియుక్త దేవతామూర్తి ప్రతీకోపాసనచే నిర్గుణ బ్రహ్మము నెఱుంగవచ్చును. (ప్రతీకము - అవయవము సాలిగ్రామమును, విష్ణు వని పూజించుట)
శ్రు|| ఉపాసకానాం కార్యార్ధం *బ్రహ్మణోరూపకల్పనా"
ఉపాసకుల సౌకర్యమునకై నిరాకార బ్రహ్మమునకు, సాకార మేర్పరుపఁబడినది. కావున నిట్టి సదసత్స్వరూపములు (కలిమిలేములు) లేక ననగా, గారణ కార్యములగు బీజవృక్షములతోఁ బృధ్వికి సంబంధము లేనట్లు, మాయా తత్కార్యములతో సంబంధములేక, ప్రకాశించువాఁడు, కలిమిసందేహించు నా పాలి అంతఃకరణ తత్ప్రతి బింబమునుగూర్చి సందేహించు (సత్యము కాదని నిశ్చయించు) మహాకావ్య బోధకుఁడు. నాపాలిటలేడా? అహంబ్రహ్మస్మి యను జ్ఞానము నొసంగఁడా?
"శ్లో|| పరిత్రాణాయ సాధూనాం వినాశాయచదుష్కృతాం - ధర్మసంస్థాపనార్ధాయ - సంభవామియుగేయగే" దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై యాయాదేశ కాలానుగుణ్యముగా వేషంబులన్ దాల్చి ధర్మ సంస్థాపనం బొనర్చు దేవదేవుఁడు ననుఁ గాపాడఁడా?