పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : కలఁ డందురు దీనుల యెడఁ

కంద||
లఁ డందురు దీనుల యెడఁ
లఁ డందురు పరమయోగి ణముల పాలం
లఁ డందు రన్నిదిశలను
లఁడు కలం డనెడి వాఁడు లఁడో లేఁడో?
బాహ్య|| దీనుల పాలిటను - యోగయుక్త గణముల పాలిటను - అన్ని దిశలను *గలఁడని చెప్పబడువాఁడు కలఁడో, లేడో (ఆర్తుని యొక్క యాలాపము)
రహ|| భక్తి పరిపక్వమయి - జ్ఞానోత్పత్తికిఁ బూర్వపుస్థితి యనగా జ్ఞానుల కంతటను * భక్తుల కభ్యాసానుసారముగాఁ బ్రత్యక్షమగుచుండును.
శ్లో|| అగ్నిర్దే వోద్విజాతీనాం *మునీనాంహృదిదైవతం
ప్రతిమాస్వల్పబుద్థీనాం * సర్వత్రవిజితాత్మనాం||
తా|| బ్రాహ్మణులకు నగ్నియును - మునులకు హృదయ మందును - అజ్ఞులకుఁ (ప్రతీకోపాసన) బ్రతిమార్చనందును - జ్ఞానులకు నెల్లడలను దైవము కలఁ డని స్మృతి చెప్పుచున్నది. యభ్యాసాను సారమనగా.
శ్లో|| తంసర్వ భూతహృదయేషు*కృతాలయోపి
తన్మంత్ర జాప్యవిముఖేషు * తనోషిమాయామ్
తన్మంత్ర సాధన పరేష్వపి యాతి మాయా
సేవానురూప ఫలదోసి యధామహీపః||
తా|| హే రామా! నీవు సర్వభూత హృదయ నివాసముఁ గలిగినవాఁడవయ్యును - నీ నామ మంత్ర జపవి ముఖుల యందు మాయను విస్తరింపఁజేయుచున్నావు. మంత్ర జపితల యందుఁ గూడ మాయ ప్రసరించుచున్నది. దృష్టాంత మెట్లనఁగా, భూపాలుఁ డెట్లాశ్రయము ననుసరించి ఫలదాత యగుచున్నట్లున్నది. కావున నట్లెంచి న్యూన ఫలదాతవు గాకుము.
శ్లో|| సంసారసాగర విశాలకరాళ కామ
నక్ర గ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య
మగ్నస్యరాగల సదూర్మిని పీడితస్య
లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్||
తా|| హే లక్ష్మీనృసింహా! విశాల మగు సంసార సారమునందుఁ గామ మను మొసలిచే గ్రహింపఁబడిన, విగ్రహముఁ (శరీరము) గలవాఁడను మఱియు రాగమను నూర్ముల - (తరంగముల)లో మునిఁగి పీడింపఁబడుచున్న నాకుఁ జేయూత నొసంగుముఁ ఇట్లు జీవుఁడు, కామ విముక్తి కొఱకుఁ బ్రార్ధించు చుండె నని భావము.