పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : జవమును జలమును

కం||
మును జలమును బలమును
వివిధములుగఁ బోరు కఱటివీరతకు భువిన్
దివి మకర మీన కర్కట
నిహము లొక్కటన మిత్రనిలయముఁ బొందెన్.
బాహ్య|| - కరటి (యేనుగు) యొక్క వేగిరపాటును పట్టుదల సత్వము (దేహబలము) మొదలగు వీరస్వభావ మనగాఁ నుద్రేకమునకు సరస్సు నందలి మీన కులీర, జలచరములలో మైత్రినిఁ బొందినవి (ఉత్ప్రేక్షాలంకారము). (కులీర - యెండ్రకాయ)
రహ|| -జీవుని, తీవ్ర ముముక్షత్వ సంకల్పమును నాదాను సంబంధము లగు - పశ్యంతి - మధ్యమ - వైఖరీ వాక్కులను పరానాదముతో నైక్యముఁజేసె నని తాత్పర్యము.
1. పరానాదము -సహస్రారము -`
2. పశ్యంతి-మూలాధారము -అక్షరసంజ్ఞ
3మధ్యమ-మణిపూరము -వచ్చీరానిమాటలు
4. వైఖరీ-అనాహతము-స్పష్టముగాపలుకుట
5-విశుద్ధము-స్వరయుక్తమగు వివిధ పదములను-ముఖద్వారమున సంభాషించుట
శ్లో|| నాస్తినాదాత్పరోమంత్రం న దేవస్స్వాత్మనఃపరమ్
నానుసంధేఃపరాపూజానహితృప్తేః పరం సుఖమ్
తా|| ప్రణవముకంటే మంత్రమును ఆత్మకంటే దైవమును - ఆత్మానుసంధానము కంటే దేవతాపూజయునులేవు.
కావున యోగి, యింద్రియ ద్వారంబులను మూసి వాయువును, అంతర్ముఖముఁజేసి’ సుషుమ్న ద్వారమునుఁ జరానాదము నందు సమ్మేళనము సేయును. (దీనిని నాదాను సంధాన మందురు) ఇట్లు జీవుఁడు నాదము, ననుసంధించి పరలోఁ గలిపె నని భావము.