పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఉఱుకుం గుంభయుగంబుపై

మ||
ఱుకుం గుంభయుగంబుపై హరి క్రియన్ హుమ్మంచుఁ; బాదంబులం
నెయం గంఠము వెన్నుదన్ను; నెగయున్ హేలాగతిన్; వాలముం
చుం; నుగ్గుగఁ దాఁకు; ముంచు; మునుగుం; ల్యంబులుం దంతముల్
విఱుఁగన్ వ్రేయుచుఁ బొంచిపొంచి కదియున్ వేదండ యూధోత్తమున్.
బాహ్య|| -గ్రహము స్వస్థానములో నున్నపుడు - శక్తి కొలందిని విలసిల్లినట్లు, మొసలి స్వస్ధాన మగు జలముల యందుండి యుద్ధవిలాసముఁ జూపుచున్నది. యెట్లన గజేంద్రుని యొక్క కుంభస్ధలంబుపై సింహమువలె నుఱుకును. బాదంబుల చుట్టు నెఱయున్ - వ్యాపించి పట్టి పైకెగసి కంఠమును, వీపును, దన్నుచుఁ గడు లాఘవముగా వాలమును బిండీకృతము సేయుచు నీటిలోనికి ముంచుచుఁ బైకి లేవకుండుటకై తాఁగూడ మునుఁగుచు దాఁకొనుచు, శల్యములను, దంతములను విఱుఁగ గొట్టుచు బాధించు చుండె నని తాత్పర్యము.
రహ|| -కుంభయుగం బనగా నిరుప్రక్కల నున్నతమై, నడుమ బల్లముగా నుండు ద్విపశిరః పురోభాగము తత్పదృశ్యమైనది. యాజ్ఞాచక్రము, భ్రూయుగస్ధాన మందుండు నది. యనగా సమకల్ప యుక్తుం డైన జీవుఁడు అహంకృతుఁడై యింద్రియములకు నాజ్ఞ నొసంగు స్థానము. కావున నాజ్ఞాచక్రము.
శ్లో|| ఆజ్ఞాచక్రే భృకుటిస్ధానే ద్విదళాంతే
హంక్షంబీజం జ్ఞానమయంతం శివశక్తిం
నాదబ్రహ్మానంద మనంతంగురు మూర్తిం
దత్తాత్రేయం శ్రీపద పద్మం ప్రణతోస్మి||
తా|| హం - క్షం - అను వర్ణ బీజ సంయుక్తమును-భృకుటీస్ధానమును - జ్ఞానరూప శక్తివంతమును - నాద బ్రహ్మానంద గురుఁ డగు దత్తాత్రేయ పాదజలజములకుఁ బ్ణణమిల్లు చున్నాను. కావున సహస్రారమార్గమున తీవ్రమగు విషయసంకల్పముచే, నుఱుకుచు ననగా, సత్సంకల్పమును నశింపఁజేయుచుఁ గండము - విశుద్ధ చక్రమును, వెన్ను - వీణాదండమును (షడాధారము) చెఱచి భక్తిజ్ఞానములను దంతములను, విఱుఁగఁగొట్టి, సద్వృత్తులను శల్యంబులను నశింపఁజేసి, మనోసరస్సు నందు ముంచి, ప్రత్యజ్ముఖంబుఁ గాకుండఁ దాఁగూడ మున్గుచు నిట్లు సర్వాంగములును, వికలాంగములుగఁ జేసి జీవుని బాధించె నని తాత్పర్యము.