పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : భీమంబై తలఁ ద్రుంచి

శా॥
భీమంబై తలఁ ద్రుంచి ప్రాణములఁ బాపెం జక్ర మా శుక్రియన్
హేక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గాక్రోధన గేహమున్ గరటి రక్తస్రావ గాహంబు ని
స్సీమోత్సాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.
బాహ్య॥ రక్తవర్ణమై పర్వతాకార మైనట్టియు, గజ సమహమునకు భయము గలుగఁ జేయు నట్టియుఁ గామక్రీడల స్థాన మైనట్టియు, గజేంద్రుని రక్తప్రవాహమును గ్రహించు నట్టియు, నుత్సాహ పూరిత మైనట్టియు మోహముచే జయశ్రీ గలిగిన మొసలినిం ద్రుంచె (ప్రాణములఁ బాపె) నని తాత్పర్యము.
రహ॥ రజోగుణ (రక్త) వర్ణముఁ గలిగినట్టియు, జీవులకు మోక్షప్రతిబంధక మై బాధించునదియుఁ గామక్రోధాదులకు స్ధానమైనట్టియు జీవనివృత్తి యత్నరక్తస్రావమును గ్రహించునట్టి కామమును జ్ఞానచక్రము త్రుంచె నని తాత్పర్యము
వ॥ ఇట్లు నిమిషస్పర్శనంబున సుదర్శనంబు మకరి తలంద్రుంచు నవసరంబున-
బాహ్య॥ సుదర్శనమిట్లు మకరిని స్పృశించిన తక్షణమే మొసలిమరణించె నా సమయంబున -
రహ॥ జ్ఞానమిట్లుకామమును స్పృశించిన తోడనే యా వరణభంగమై కామమంతరించెనా తదుపరి-