పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : భవము దోషంబు

సీ||
వము దోషంబు రూపంబుఁ గర్మంబు నా;
హ్వయమును గుణము లెవ్వనికి లేక
గములఁ గలిగించు మయించు కొఱకునై;
నిజమాయ నెవ్వఁ డిన్నియునుఁ దాల్చు
నా పరేశునకు ననంతశక్తికి బ్రహ్మ;
కిద్ధరూపికి రూపహీనునకునుఁ
జిత్రచారునికి సాక్షికి నాత్మరుచికినిఁ;
రమాత్మునకుఁ బరబ్రహ్మమునకు
ఆ||
మాటలను నెఱుకల నములఁ జేరంగఁ
గాని శుచికి సత్త్వమ్యుఁ డగుచు
నిపుణుఁ డైనవాని నిష్కర్మతకు మెచ్చు
వాని కే నొనర్తు వందనములు.
బాహ్య|| పరమేశ్వరుఁడు తనకు జన్మ కర్మ నామరూపగుణాదులు లేకున్నను, జగముల యొక్క సృష్టిస్థితిలయాదుల కొఱకు స్వకీయ, మాయా సంబంధముచే నన్నియుఁ గల వానివలె ననంత శక్తి గలిగియుఁడెనో, యట్టి (వ్యాపక) స్వరూపునకు నిద్ధ - ప్రసిద్ధునకు నాశ్చర్య ప్రవర్తకునకు - వాక్కులకును మనస్సునకును, - దెలియుట కసాధ్యమగు వానికి సత్యముచేతఁ బొందఁ దగినవానికిని, నేర్పరియైనవానికి, నైష్కర్మ్యతకు మెచ్చువానికి వందనము లొనుర్చుచున్నా నని తాత్పర్యము. నైష్కర్మ్యత - (కర్తృత్వరాహిత్యత)
రహ|| భవము - జన్మ, మనగా షడ్వికారములు, ఆస్తి -
జాయతే - వర్ధతే - విపరిణయమతే - నశ్యతే - వినశ్యతే అనువికారములు - దోషము - పాపము " నపుణ్యంస
పాపంన సౌఖ్యంన దుఃఖంన మంత్రోనతీర్ధోన వేదానయజ్ఞాః - అహంభోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపశ్శివోహంశివోహం|| " పాప పుణ్య, సుఖ,
దుఃఖ, మంత్ర, తీర్ధ, వేద, యజ్ఞ, భోజన, భోజ్య, భోక్తృ (త్రిపుటి) నేను, గాను చిదానందరూపుఁ డగు శివుఁడను రూపాదులు "నాహం రూపం నామనాహంసకర్మ" నామరూపకర్మములు నాకు లేవు. అయినను జగత్సృష్టి సంహారముల కొఱకు నన్నియును మాయచేఁ దాల్చినటు లగుపడునో" మాయాకల్పిత దేశకాల కలనా - వైచిత్ర్య చిత్రీకృతం - మాయావీన విజృంభయత్వ పి మహాయోగీనయస్వేచ్ఛయా"
తా|| మాయాకల్పిత దేశకాలాది భేదముచే నెఱుంగఁబడి విచిత్రముగాఁ జిత్రీకరింప (ఆకారముగాజేయ)బడిన జగత్తును, మాయావి - ఇంద్రజాలికునివలె యోగమాయచేఁ ద్రిప్పుచున్న వానికి ననగా ఆత్మ యొక్క సాన్నిధ్యముచే బ్రకృతిసత్తా కలిగిన దని భావము "జగంతి నిత్యం పరితోభ్రమంతియత్సన్ని ధౌచుంబక లోహవద్ధి" యే పరమాత్మ యొక్క సాన్నిధ్యముచే - సూదంటుఱాతి సమీపమున నున్న యినుమునకుఁ జలనముఁ గలిఁగినట్లు కలిఁగె నని భావము. - అట్టి మాయావికి సిద్ధరూపికి - బంగారపు - కణికకంటె - భూషణమునకు నెక్కువ ప్రకాశత కలిగినట్లు
ప్రపంచరూప ప్రసిధ్ధునకుఁ జిత్రచారునకు, నంతర్యామికి, సాక్షికి, నాత్మరుచికి, మనోరూప ప్రకాశమునకును, వాగాదుల కగోచరుఁడును - నిష్కర్మతకు మెచ్చువానికిని, "బహిః కృత్త్రిమ సంరంభోహృది సరంభవర్జితః - అకర్తాంతర్భహిః కర్తాలోకే విహార రాఘవ" పైకిఁ గపటాడంబరమును - అంతరమున సంరంభ వర్జితుఁడై లోకమందు వర్తించవలెను. అట్టివాఁడు. నిపుణుఁడు అట్టి నిపుణునిచేఁ జేయఁబడు కర్మ - నిష్కర్మ యట్టి నిష్కర్మతకు మెచ్చు నట్టివానికి నమస్కరించెద నని భావము.