పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : ఆటోపంబునఁ జిమ్ము

శా||
టోపంబునఁ జిమ్ము ఱొమ్మగల వజ్రాభీల దంతంబులం
దాటించున్ మెడఁ జుట్టిపట్టి హరి దోర్దండాభ శుండాహతిన్
నీటన్ మాటికి మాటికిం దిగువఁగా నీరాటమున్ నీటి పో
రా న్నోటమిపాటుఁ జూపుట కరణ్యాటంబు వాచాటమై.
బాహ్య|| నీరాటము (మొసలి) స్వస్ధానమగు నీటిలోఁ బోరుటచే బలముఁ గలిగి గజమును మాటి మాటికి నాకర్షించు చుండఁగా (అరణ్యాటంబు) గజము క్షిప్రగతిని మకరమునకు నోటమపాటు-భయాందోళనము గల్గునట్లు వాచాటమై - ఘీంకారముఁ జేయుచున్నదై దోర్ధండాభ - కాంతి కలిగిన తొండమను బాహుదండముచే జలచర గ్రీవమును జుట్టుపట్టి వజ్రాయుధమువలె భయంకరములగు దంతములచే మకరి యొక్క గుండె, చిప్పలు, నూడునటు, లుల్లంఘించె నని తాత్పర్యము (గట్టిబిట్టు - మంచివేగము),
రహ|| - కామమునకు స్వస్థానమగు సంకల్పమునందు - జీవుని యుద్ధముఁ జేయుటచే బలముఁ గలిగి జీవుని సంకల్పమునికు నీడ్చుచుండ, జీవుండు కామమునకు భయమువారినట్లు స్వరూపజ్ఞానము (తొండముచే) గామమును, బ్రాణాయామముచే నాకర్షించి, బంధించి విజ్ఞాన దంతములచే గామము యొక్క రాగద్వేషాది ఱెక్కల, తత్కార్యావసాన పర్యంత యుండును.
శ్లో|| వాంచాక్షణేతుయా తుష్టి*స్తత్రవాంచైవ కారణ
తుష్టిస్త్వతుష్టి పర్యంతాత్తస్మాద్వాంచాంపరిత్యజ
తా|| వాంచాక్షణమునఁ గల్గు విషయానుభవ సంతుష్టికి, వాంఛయే కారణము. అసంతుష్టియో, యసంతుష్టి పర్యంత మనగా విషయానుభవ పర్యంతమే యుండును. అందువలన వాంఛను విడువుము. విషయానుభవానంతరముఁబు నర్ధశాధిక ప్రయత్నముతో వచ్చెద నని కామము, నిత్య ముండిపోవును. అనఁగా గాముకుని విషయాభిలాష నిరంతరాభివృద్ధిఁ గలిగి యుండును.
- అట్టి విషయాభిలాషను విచారణచే నిర్భంధించె నని భావము.