గజేంద్రమోక్షణ రహస్యార్థం : అటఁ గాంచెం గరిణీవిభుండు
మ||
అటఁ గాంచెం గరిణీవిభుండు నవఫుల్లాంభోజకల్హారమున్
నటదిందిందిర వారముం గమఠ మీనగ్రాహ దుర్వారమున్
వట హింతాల రసాల సాల సుమనో వల్లీకుటీతీరముం
జటులోద్ధూత మరాళ చక్ర బక సంచారంబుఁ గాసారమున్.
బాహ్య|| గజేంద్రుడు, తెల్లదామర హారముఁగలిగి చంచలించు మధుపములతోఁగూడి, కూర్మ, నక్రములచే, భయంకరమై, చుట్టును మఱ్ఱి, గిలకతాడి, తియ్యమామిడిచెట్లతో నలంకృతంబై,
మఱియు లతా పొదరిండ్ల యుక్తమై, యుడ్డీనగత యుత హంసలును - చక్రవాక, బక, సంచార పూరితంబైన కాసారంబుఁ గాంచె నని తాత్పర్యము.
రహ|| - అంతఃకరణ కరిణీ విభుండగు, ముఖ్యాహంకారవిషయుఁడగుపారమార్ధిక జీవుఁడు, నవపుల్లాంభోజ, యనాద్యవిద్యావాసనలచేఁ బరిమళించు హృత్పద్మములచే వికసితమైనట్టి, నటదిందీవరవారమున్ పద్మముల యందలి తుమ్మెదలు "శ్రు|| క్షణమాయాతి పాతాళం -
క్షణంయాతిన భస్థలంక్షణం భ్రమతిదిఃకుంజే తృష్ణాహృత్పద్మషట్పదీ"
హృత్పద్మమునందలి తృష్ణయను తుమ్మెదః యొక్కొక్కొ
క్షణమునకు పాతాళము-అంతరిక్షమునకును -దిగంతములకును - దిరుగు చుండ్రును. అట్టి సంకల్పభావపరిగళితి తృష్ణయను యిందీవరములు (తుమ్మెదలు) గలిగినట్టియు, లోభ, మోహ, గామాద్య నివారిత జలచరయుక్తమై, సుమనో వల్లీకుటీ తీరమున్ - శుద్ధసాత్వికమను లతానిర్మితకుటీరతీరమును - జటులోద్ధూతమరాళ చక్రబక సంచారంబు - భయజనకమగు, మోహమ రాళంబును - నసూయ, దర్పాది, చక్రవాక, బక, విహంగ, తరంగ, విలోలితయునగు మనః కాసారమును జూచె నని రహస్యార్ధము.
వ|| ఇట్లనన్య పురుష సంచారంబై, కళంక రహితంబైన యక్కమ లాకరంబు వీక్షించి-
రహ|| ఏకాంతంబై , నిస్సంకల్పమై, విశుద్ధంబైయున్న యా మానస సరోవరం బవలోకించి-