పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

గజేంద్రమోక్షణ రహస్యార్థం : అల వైకుంఠపురంబులో

మ॥
వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్ప పర్యంక రమావినోది యగు నాన్నప్రసన్నుండు వి
హ్వ నాగేంద్రము పాహిపాహి యనఁ గుయ్యాలించి సంరంభియై.
బాహ్య॥ వైకుంఠ పురమున విష్ణువు నివసించు మొదటి హర్మ్య సమీపమునఁ గల్పద్రుమ వనాంతర మందన్న యమృత సరస్సు యొడ్డునఁ జంద్రకాంత మణి రచిత పర్యంక (పందిరిమంచమున) లక్ష్మితో గ్రీడా వినోది యగు నా పన్న శరణ్యుండు - నిశ్శేష్టితమైన నాగేంద్రము రక్షించు మని వేడిన నా యాలాపము నాలించి వేగిరపడిన వాఁడై
రహ॥ కుంఠ మనగా నశించునది, వికుంఠమనగా నశించనిది - వికుంఠ స్వభావః - వైకుంఠ మనగా నాశనము లేనిది నాకాశములో మూలసౌధము - పరాకాశము - అనిర్వచనీయ సర్వవ్యాపక జ్యోతి - సమీప మందార వనాంత - సత్య సంకల్ప స్వరూప వనాంతరానందామృత సరస్సనగా - శుద్ధబోధానందామృత సరస్సు సమీపమునఁ బరిశుద్ధ సాత్విక యగు ప్రకృతితోఁ గ్రీడించు పరాత్పరుఁడు జీవప్రార్థన నాలించి యావరణ భంగముఁ జేసి తాదాత్మ్నానుసంధాన సంరంభుఁడై వ్యక్తిగతము - "నీవారశూకవత్తన్వి పీతాభ్యస్వత్యణూపమా - తస్యాః శిఖాయా మధ్యేపరమాత్మా వ్యవస్థితః"
తా॥ నివరధాన్యపుమువంటివలె సుక్ష్మమై యున్న సుషుమ్న పీతవర్ణము (పీతాంబరధరుఁడు) దానిలోఁ బరమాత్మ యున్నాడు.
శ్రు॥ "అణోరణీ యాన్మహతో మహియా నాత్మాగుహాయాం నిహితో స్యజంతోః
తా॥ అణువులకంటె నణువును మహత్తులకంటె మహత్తును గొప్పదియు నగు ఆత్మ జీవుని యొక్క దహరము నందుంచబడినది.
శ్రు॥ భూరిత్య గ్నౌ ప్రతితిష్టతి, భువఇతివా యౌసువరాదిత్యేమహాఇతిచంద్రమాః। చంద్రమసావావజ్యోతీగీంషి మహీయంతే॥
తా॥ షణ్ముఖ యభ్యాసునకు - భూమండలము - అగ్నిమండలము - వాయుమండలము - సూర్యమండలము - అగ్నిమండలము - వాయుమండలము - సూర్య - చంద్రమండలములు - జ్యోతి దర్శన మగును.