పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : ప్రద్యుమ్న గుహుల ద్వంద్వయుద్ధము

ప్రద్యుమ్నుఁడాగుహుపై నాటసేసె; 
తఁడు కోపించి రితనూభవుని
కేతుదండము విల్లు గృత్తము సేయ 
వేఱొక్క విలుగొని విష్ణునందనుఁడు
నూఱుబాణంబులు నొప్పింప గుహుఁడు
నశక్తివైవ నిర్ఘాతశతంబు
నుదెంచుగతి వచ్చు టులతఁజూచి
రదంబు దిగినిల్వనాతని శక్తి
రుల సూతుని తేరు డగించి చనియె; 
తిపతి యొండొక్క థమెక్కి గుహుని
శితిశరంబున నేయశిరమును నురముఁ
గిలి నెత్తురు గ్రమ్మఁబలగాత్రంబు
చిగురొత్తు కింశుకచెల్వు వహించె;      920
సేనాని పఱచుండఁజేరి యాప్రమథ
సేన బ్రద్యుమ్నుఁడు చెండాడఁదొడఁగె;