పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : మూర్ఛపోయిన రుక్మిణిని శ్రీకృష్ణుఁడోదార్చుట

న్నాతిఁ గనుగొని యంబుజోదరుఁడు
రభసంబున లేచి తినల్లనెత్తి
రముఁ గౌఁగిటఁ జేర్చి న్నీరుఁదుడిచి
చెక్కిలి నొక్కెత్తి చికురముల్ దుఱిమి
క్కటికముతోడ క్కాంత కనియె. 
“నవ్వులాటకు నన్న నామాట కింత
నివ్వెరపడి వ్రాల నీకేల యింతి? 
లనాగ! నీచిత్త మెఱిఁగెడి కొఱకు
లికితిగాని నా ప్రాణంబు నీవ!     700 
రమసాధ్వివి నీవు యభక్తులందు
నెరసులేకున్ని నే (నెఱి భాగ్యశాలి)
మ్ముల ననుఁబాయ కే ప్రొద్దునుండు
మ్మహాలక్ష్మి నీవంభోజనయన!” 
ని పల్కి శయ్యపై ల్లనఁజేర్చి. 
నునయంబున దేర్చి బలకుఁ దార్చి
రసరతిక్రీడ సంతుష్టుఁ జేసి
రమపావనమూర్తి పంకజోదరుఁడు
కందర్పకోటి సంకాశలావణ్యుఁ
డిందిరావిభుఁడు లోకైకశరణ్యుఁ
డారసి యందఱి న్నిరూపముల
సౌరతిక్రీడల తతంబుఁ దేల్చె.