పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణుఁడును బార్ధుఁడును వేఁటకై వెడలుట

త్తరి నొకనాఁడు రియుఁ బార్ధుఁడును
జిత్తాబ్జముల వేడ్క చిగురులు వొడమ
వాయు వేగములైన వాజులఁ బూని
యాయుధ పరిపూర్ణగు రథంబెక్కి
ణిత సారమేయావళితోడ
మృయలాయుధ రశ్మి మెఱసి తో నడువఁ
గాకోల భీకర కాకోదరంబుఁ
గాక ఝిల్లికము భీర రావకులము
రిమితాభీల ర్యక్ష కులము
కుపిత కోలాంగూల కోలాహలంబు
రితుండ ఖండిత న పిప్పలంబు
ర తపః పరికీర్ణ ల్లవ స్థలము 
ప్రటిత కుంజర వ్రాత కంటకము
వికృత భల్లవ్యాఘ్ర వృక సమూహంబు
గు మహారణ్యంబు నందంద చొచ్చి
మృయానురక్తులై మెలఁగి యాలోన
లొగ్గి తెరలొత్తి ర భటోత్తములు
లిసి కొమ్ములనుండి దిలమైనూఁద      490
రఁగఁ గిటివ్యాఘ్ర ల్లసారంగ
రి సింహ శరభ ఖడ్గకలులాయములు
గంభేరుండాది నమృగాదులును
దండిమైఁ బరవర్వెఁ ,గిలి యేయుచును
గుక్కల విడుచుచుఁ గోరి పెన్వలలు
నెక్కొనఁ జుట్టియు నిబిడాస్త్రసమితిఁ
బొలియించియును మృగంబులఁ గీటణించి
సి కృష్ణార్జునుర్కకన్యకకుఁ
నుదెంచి శీతలలమాని తీర
మునఁ దరుచ్ఛాయ నిమ్ముల విశ్రమింప