పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - కల్యాణకాండ : శ్రీకృష్ణబాణాసురల ద్వంద్వయుద్ధము

చండాంశుదశకర టులంబులగుచు 
మండితదోర్ధండహిమ దీపింప 
శ్రీమ్యతర మేరుశిఖరమో యనఁగ
చారుకిరీటనిశ్చలకాంతి నిగుడ
లితాంబుధరతటిల్లతికలో యనఁగ
లిసి యుగ్రాయుధప్రభలుప్పతిలఁగఁ
దాఁకునఁబూర్ణ సుధాంశుచే నైన 
ప్రాట ముక్తాతత్రంబు వెలుఁగఁ 
బ్రమాద్రిఁ దోతెంచు భానుఁడో యనఁగ
మెక్కి గర్వదుర్వార వేగమున
రిమీఁద జనుదేర తని కేతనము
మురిసి కూలుటయును ముదమంది(మదిని) 
లిగెఁ గదా! నాకుఁ దనరంగమునఁ
లుషంబుతోఁ జేతిమి తీఁటమాన్ప”
ని మురారాతిపై నంబకాష్టకముఁ
జొనుపుటయును శౌరిచూచి కోపించి
టుశార్ఙనిర్ముక్తబాణజాలముల
వితాటముగ దైత్యవిభునేయ నతఁడు; 
యేనూఱు చేతుల నేనూఱు విండ్లు
బూని నానాస్త్రముల్ పొరినేర్చి నారిఁ
దొడిగి పల్లేసినఁ దొలఁగక వాని
డుమనే తునుమాడె లినలోచనుఁడు
తొడిబడ విండ్లన్ని దునిమి రథములఁ
బొడిసేసి సారథి బొడవడగించి
దంబుఁ దునుమాడి యార్చియాశౌరి
ముల మేను జర్ఘరితము చేసె; 
డుఁదుర్లు గుట్టినరణి మేనెరియ
నొలు పెన్నెత్తురులొలుక నయ్యసుర
లిచూడక పార దనారి యంత