పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : శ్రీకృష్ణుఁడు కుబ్జను మంచిరూపము నిచ్చి యనుగ్రహించుట

నియెఁ గృష్ణుఁడు రహిగంధపుచిప్ప
చేతఁ బూని త్రిక్రయై నడచు
రుహాక్షుఁడు కుబ్జ పలాక్షి నొరసి)
ని చల్లన నగుచు “లకంఠి యెందుఁ
నియెదు? గంధబాన మెవ్వరికిని   - 60
గొనిపోవుచున్నావు కొమరప్ప నీవు?” 
వుఁడు హరిఁ జూచి యాకుబ్జ పలికె
పాక్ష! యేను సైరంధ్రిన్ త్రివిక్ర
నుదాన. రాజు నన్నర్థి మన్నించు. 
గందంబు వాసించి లపంబుఁ గూర్చి
యందంబుగా మేన లఁదఁ గానేర్తు
నిదె, దేవరకు యోగ్య మీగంధ, మలఁ ది
దివేలుభూములు పాలింపు” మనుచు 
మ్రొక్కి గంధపుచిప్ప ముందఱ నిడిన
క్కజంబుగ శౌరి లియునుఁ దాను
చందనం బలఁది యా పలాక్షి మేని
చందంబుఁ జూచి యా తురుఁడు దాని
కాలుకాలున మెట్టి కందువ1-7కీలఁ
గీలించినంత మైకిటుకును1-8 మాని
మెలఁతుక క్రొవ్వాఁడి మెఱుఁగ కోయనఁగఁ
లికి కన్నుల సోయము నివ్వెటిల్ల
మురిపంబు చిరునవ్వు మోమున మెఱయ, 
రిఁ జేరి సరసోక్తి ల్లనే పలికె. 
“నాకాలుఁ ద్రొక్కితి న్నుమన్నించి
నాకోర్కిఁ దీర్చుట నెయ్యంబు (న్యాయంబు) నీకు   - 70
నా యింటి కేతెమ్ము లినాక్ష!” అనుఁడు, 
యింతిఁ గనుఁగొని “టఁబోయి మఱలి, 
నుదెంచెదము గాన నియెద” మనుచు
నిత వీడ్కొలిపి, యా సుదేవసుతుఁ డు
ని వణిక్పథమున కల (బేహార్లు)
నుపమ దివ్య గంధాంబరాభరణ
ములు కానుకలు చేసి మ్రొక్కి దీవింప; 
చెలువల మనములఁ జిత్తజానలము


1-7) కందువన్ = నేర్పున

1-8) కిటుకు = చిక్కు