పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : పౌండ్రకుని మరణమునుగాంచి కాశిరాజు శ్రీకృష్ణునిపై గవిసి మడియుట

ని కాశిరాజు “నేఁలుగంగ నేలఁ
నుకని పార నొక్కట నిల్వుఁ” డనుచు
ములఁ బురిగొల్పి దైత్యారితోడఁ
పడి బహుబాణతుల నొప్పింపఁ  - 170
3-7 గోవ్రేసిన మ్రోఁగు కోల్పులిభంగి
వామ్ములురమున డిఁగీలు కొలుపఁ
3-8 గాలాగ్నిసదృశభీరచక్రనిహతి 
ముడివడు బొమలతోఁ బొలుచు మస్తకముఁ
వైచి యార్చె; నీ భంగి శాత్రవుల
నిరివురఁ బొలియించి నిందిరాధీశుఁ
రుదెంచె ద్వారక మరాళి పొగడ. 



3-7 కోలన్ = బాణముతో; వ్రేసిన = కొట్టిన; మ్రోఁగు = అరచు; కోల్పులి = పెద్దపులి

3-8 ఒకే పాదమున్నది