పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : పౌండ్రకుఁడు దూతను శ్రీకృష్ణుని వద్దకుఁ బనుచుట

రి సన్నిధికిఁ దజ్ఞుఁను దూతఁబనుప
రుదెంచి తగ సుధర్మాభ్యంతరమున
వృష్టిభోజాంధక వీరులుఁ గొలువ
నిష్టవర్తన నున్న నిందిరారమణుఁ
ని మ్రొక్కి తనవచ్చు కార్యమంతయును
వినుపించఁ జొచ్చెను వెఱపింత లేక. 
పౌండ్ర నృపతి యావదండపాణి
భూపాలతిలకంబు వుత్తెంచె నన్ను. 
తఁడు నీతోడ నుమన్న మాట
3-2 లాతంబుగ విను మంభోజనయన! 
“వసుధభారము మాన్ప వైరుల నడంప
దెలఁ బెంపఁగ వాసుదేవుఁడ నేను 
నాచిహ్నములుఁ దాల్చి నాపేరుఁ దాల్చి
యీచావుఁ దెచ్చుకో నేఁటికి నీకు? 
గదాశంఖచక్రమును శార్ఙమును
3-3 కాంబరంబును రుడకేతనము
రకుండలములు ణికిరీటంబుఁ 
బ్రటంబగుజలసత్ప్రసవమాలికయు
నివినాకు వేవేగ నిచ్చి ప్రాణముల
రించుకొని నన్ను రణంబుఁ జొరుము;  - 150
కాదేని నాతోడ దనంబు సేయ
నాటఁ బేర్చి ర”మ్మ ని చెప్పె” ననుఁడు; 
విని జనులందఱు వికవిక నగఁగ
నుఁడు కృష్ణుఁడు వానిఁ నుగొని పలికె. 
“కంక్రొవ్వున గన్ను గానకఁ బెక్కు
దుంగంబులు ప్రేలి త్రుళ్ళుగాకేమి! 
భంనభూమిలోఁ రిమార్చి వాని
కంలు భేతాళణముల కిత్తు,” 
ని పల్కి దూతకు ర్ఘ్యవస్తువులఁ
నిపి వీడ్కోలుప పౌండ్రునితోడ
రి వాక్యములు జెప్ప తఁడు కోపించి
దుమున కేతెంచె దోర్గర్వ మెసఁగ. 



3-2 ఆతతము = విపులము

3-3 కనకాంబరము = బంగారు వస్త్రము