పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : కురుపతి బలరాముని బ్రార్ధించుట

ముదము తత్తరపాటు మొలవంగ నతని 
దపంకజములకుఁ బ్రణమిల్లి నిల్చి 310 
యాతనిదెస మొగంబై కేలుమొగిచి
యాతుర ఫణతి నిట్లని విన్నవించె. 
“దేవదేవారాధ్య! దివ్యావతార! 
భావగమ్యాకార! క్తలోకేశ! 
శ్రీధరణీభర! శేషావతార! 
మాధవ! నిగమవాఙ్మయ నిర్వికార! 
వెయ్యిపాదంబులు వెయ్యిచేతులను
వెయ్యితలల్ రెండువేలుజిహ్వలును
లిగి యందొక ఫణాగ్రమున నీజగతిఁ
గొలఁది నీలముభంగిఁగొని తాల్చునీవు
భూతాళి బుట్టింప బ్రోవ శిక్షింప
చాతుర్యుఁడవు నీవు కలలోకేశ! 
నీతత్వమెఱుఁగంగ నేరక క్రొవ్వి
యీతఁడాడిన మాటలెల్లను సైఁచు! 
క్షించు! మీ యుపద్రవము వారించు! 
క్షయబలరామ!” నిసంస్తుతింప
నప్రసన్నాత్ముడై కామపాలుండు 
నరార నంబికానయు మన్నించి
లముఖ మెడలించె ప్పురికోట
లరాముచే బాధడి కొంత యెత్తి  - 320
నేఁడును జూపట్టె నెఱి మోము మహిమ! 
పోఁడిగా వినుతింపఁ బోలదెవ్వరికి
కురుపతి యల్లునిఁగూతును ననిచి 
రణంబు పదివేలు రులును గరులు
మూఁడు వేల్రథములు మొగినాల్గువేలు
పొఁడిగ నిచ్చి యపుడు దోడుకొనుచును 
ద్వారక కేతెంచెఁ దాలాంకుఁడంత; 
శౌరి యంతయు విని సంతోషమందె.” 
నిచెప్పుటయు రాముతుల విక్రమము
విని కురుప్రవరుండు విస్మయంబంది
“పరమయోగీశ్వర! లభద్రు మహిమ 
రసిజాసనుకైనఁ ర్చింపరాదు
రియెట్లు విహరించె టమీఁది కథలు
రిపాటి నాకు నేర్పడఁ జెప్పుఁ”డనిన
బాదరాయణియు నప్పద్మాక్షు మహిమ
నాదరంబున వినుమని చెప్పఁదొడఁగె. 
“నరకునిద్రుంచి యాలినలోచనుల
వెరవార పదియాఱువేలనూఱ్వురను
రిణయంబయ్యె నాపంకజోదరుఁడు
రపేది యిందఱఁ బొందునా! ఒకతె - 230