పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : హేళనచేయు సుయోధనునిపై నాగ్రహముచే సీరి హస్తినాపురిని నాగలిమొనచే లేవనెత్తుట

“అకట! గురుస్థానని నిన్నుఁజూడ
మెకమెకపడు మందమేళముల్ తగునె? 
3-14 కనిఁ గొల్చిన వార లుర్విలో మీరు! 
దిగర్భేశ్వరు గు కౌరవులకు
యాదవులకు వియ్యమందంగఁ దగునె? 
మిమ్మేలురాజును మీరును నాకు
నెమ్మి యీడొనరింప నెంతటి వారు! 
రి మంచితనమున న్నియు నొప్పె
రగుట సల్లాపహజభోజనము
లిపి మన్నించినఁ నవున మీరు
లసి వర్తింతురుగాక యేనాట
నెక్కడి బాంధవంబిక? మాకు మీకు
క్కి వోనాడఁగఁ నిలేదు వేగ 
విచ్చేయు” మను కురువిభుఁ జూచి సీరి
చిచ్చులో నెయ్యిఁబోసిన భంగి మండి! 
“కాలుఁడు ప్రేరేపఁ గానక యిట్లు 
ప్రేలెదవేల? నీ పెంపెల్లఁ బొలియ
రుస నెఱుంగక దరెదుగాక
రికి నీకును నేది యంతర మోరి!  - 300
వ్వరు నాకు మీ రెందఱున్నారు? 
వ్వరుగలరు నీకీబారి గడప! 
నీ బలంబులు నిన్ను నీ పట్టణంబు
నాబాలవృద్ధమై యమునలోవైతు!” 
ని పేర్చి దర్పించి లదండమెత్తి
నరౌద్రలయకాలకాలుఁడో యనఁగ
రిపురికోట నాఁటి వాత గ్రుచ్చి
రమున నుంకించి టుశక్తిఁ దివియ; 
ది యొడ్డగిలి పడ ఖిలమానవులు
బెదరి నిల్వఁగలేకఁ పృథివిపై వ్రాల
భీతిల్లి సంధులు పృథివి వేచఱువ
నాతురారావంబు నందంద చెలఁగ
నాంబికేయుఁడు విని లిచందమెఱిఁగి
సాంబుని విడిచి లక్షణసమేతముగఁ
దోకొని సకలబంధులుఁ దన్ను గొలువ
నాకౌరవేశ్వరుఁ డాపగాతనయు
విదురుల మాట నిర్విణ్ణుఁడై వినుచు
దరుచు నేతెంచి లభద్రుఁగాంచి



3-14 ఒకే పాదమున్నది