పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు జరాసంధుని యుద్ధభిక్ష వేఁడుట

“అఘాత్మ! యీయింటి థితులు మేము

నర బ్రాహ్మణ వేషధారులై చొచ్చి - 530 
రులకభేద్యుఁడై లరు మాగధుని 
ర మందిరమున కవారణ నరిగి
దేవగురుద్విజ తృప్తిఁ గావించు
సావధానుని జరాసంధునిఁ గాంచి 
వామనరూపమై చ్చి యబ్బలిని
భూమి వేఁడినయట్టి బుద్ధులప్రోగు
నిలజార్జునులతో ర్థి దీవించి
నవున నాజరాసంధుతో ననియె. 

నుదెంచినారము కలవస్తువులు
డిగిన లేదన ర్థుల కిచ్చు
డుపుణ్యనిధివి మాధరాజతనయ! 
మిగోరిన యర్థ మిచ్చి నిచ్చలును
భూమిలోఁ బొగడొంది బొంకవెన్నఁడును! 
కపోతమునకై కండలు గోసి 
నువిచ్చి శిబి ధాత్రి న్యుఁడు గాఁడె! 
మును హరిశ్చంద్రుండు మొగి కౌశికునకుఁ
రార పుత్రునిఁ గ విక్రయించి
చండాలరూపమై శౌర్యంబుఁ గ్రాఁగి
యుండి తాఁబొందఁడే యూర్ధ్వలోకంబు!  - 540
 కపోతము తొల్లి యొక కిరాతునకుఁ 
బ్రటమై తనమేను క్ష్యంబుఁ జేసి
యెట్టిపుణ్యులకైన నెన్నఁగరాని
ట్టిలోకము గాంచె ని చెప్ప వినమె! 
డుచును కనకంబుఁ బ్రాయంబు నమ్మి
డిగిన లేదని ర్థి వర్గంబు
నెపిన పాపాత్ము లిందును నందుఁ
జెడిపోవుదు”రనుచుఁ జెప్పిన నతఁడు 
వారి తేజంబులు వారి సత్వములు
వారి మేనుల రణవ్రణకిణంబులును
ని మహీనాథులుగా నిశ్చయించి
నియె వారలతోడ ల్లన నగుచు. 
“భూపాలకులు మీకుఁ బురుడేది! విప్ర
రూపంబులొంది మా ప్రోలికి వచ్చి
డుగుచున్నారు మీథితులుగారు! 
డుగుఁడు ప్రాణంబులైన మీకిత్తు! 
విప్రవేషముఁదాల్చి వేఁడుట చేత
విప్రోత్తముఁడు స్వయం విష్ణుఁడ వీవ”
ని పలుకఁగ శౌరి తని తెంపునకు
ములోపలమెచ్చి గధున కనియె. - 550 
ఘ! యుద్ధార్థులమై వచ్చినార
మెయఁ గృష్ణుండ నే నితఁడు వాయుజుఁడు
వాఁడు కవ్వఁడి మాకు ద్వంద్వయుద్ధంబు
పోఁడిగా నిమ్మన్న పొంగి మాగధుఁడు
“అగుఁగాక మీకోరి ట్ల యుద్ధంబుఁ
 నిచ్చినాఁడ యుద్ధతఁ జేర్చిరండు
“గోపాల! నీవోడి కురుకుమారకుల
వైపునఁ దెచ్చితి! డుచుల తరమె! 
దప్పి నీవోడి పారిన నేల
సువు మొల్వదు నేఁడు! కాన నీతోడ
రంబు సేయుట మయంబు గాదు
లాక్ష! నాకీడుగాఁ డర్జునుండు
ల్లయుద్ధంబున మారుతాత్మజుని 
త్రుళ్లడంచెద! మీరు తొలఁగఁగ జూడుఁ”