పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుని ప్రోత్సాహముచే ధర్మరాజు రాజసూయమునకు గడంగుట

రాజుల రక్షింప రాజసూయంబు
నోముఁ దప్పక నొనరింపు” మనిన
రి వాక్యములకుబ్బి మతనూభవుఁడు
కురుపతి ముఖ్యులఁ గోరి రప్పించి
భాగీరథీతీర పావనస్థలిని
యాశాలలు గట్టి ఖిల వస్తువులు
కూర్చి వ్యాసాది సంయమీశ్వరులఁ 
గ్రమొప్ప ఋత్విజణము రావించి
యాగోపకరణంబు న్నియుఁ దెచ్చి
యామోక్తక్రియ న్ని సంధించి  - 620
క్షుల నియమించి ర్మనందనుడు
దీక్షితుఁడై మహాద్విజకోటితోడ
వేలుచుచుండఁగ విష్ణుఁడంతటికిఁ
జాలి భూసురవర్యమితితో నిలువ
మ్ములు సకలబాంవులును దారుఁ 
గ్రమ్మర పరిచర్యఁ గావింపుచుండ
వ్యభాగమునకు ఖిల దేవతలు
దివ్యయానములతో దివినుండి చూడ