పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణుఁడు సుదర్శనమును గృత్తిపై పనుచుట

నుకొల్చియున్న సుర్శన పురుషుఁ
ని నల్ల నవ్వుచు నుసన్నఁ బనుప
మ్మహాచక్రంబు రి యాజ్ఞఁ బూని 
క్రమ్మన నేతెంచి కాలాగ్ని వోలె - 200 
యోజనోత్తాల టుల విగ్రహము
భుజసమదోగ్రస్త్రాస్త్రములును
సహస్రార్కనిర్గత తీవ్రరుచులఁ
బెనుమంటలెగయ నాభీలమై పేర్చి
రి చక్రమేతెంచు టాలించి కృత్తి
లె బిట్టొఱలుచు ది విహ్వలింప
గంగ నయ్యెదు ప్రవరసాధనము
ఱిముఱి వెనుకొన దికాశిఁ జొచ్చె. 
చొచ్చిన నిట్టట్టు సురగంగ నీక
చ్చక్ర మడరి ఘోరానలశిఖల
నాత్విజులతోడ నాకృత్తితోడ
నారాజుతోడ జనావళితోడ
శతాంగక వాజి జశాలతోడ
ధాన్య వస్తు సంతానంబుతోడఁ
3-11 బొలుపారుసౌధగోపురములతోడఁ
గాశీపురము చక్కుగాఁ జేసి కాల్చి
యీశేషి హరి పాలికేతెంచి మ్రొక్కె. 
నీథావర్ణన మెల్ల వారలకు - 210 
ప్రాటకృత్యముల్ బాధలు నడఁగు 
పుత్రసంపదలును భోగసంపదలు
త్రుక్షయంబు మోక్షము నిచ్చుచుండు.” 
నిచెప్పుటయువిని భిమన్యసుతుఁడు
వితుఁడై శుకయోగివిభున కిట్లనియె. 
“ఆ మందలో నుండి రుదెంచి యచట
కాపాలుండేమితి విశ్రమించె? 
ని చరితంబు నిశంబు వినఁగఁ
గౌతుకంబయ్యె నాథఁ జెప్పు” మనిన


3-11 ఒకే పాదము కన్పట్టుచున్నది.