పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : శ్రీకృష్ణలీలలు

క్కడ హరి యుద్ధవాచార్యు తోడ 
క్కజంబుగఁ జూదమాడగఁ జూచి
తనిచేఁ బూజితుఁడై వేరె యొక్క
తియింటి కరుగుచో స్త్రాస్త్రలీల
భ్యసింపుచునున్న రిగాంచి మ్రొక్కి
భ్యుదయంబని టవోయి చూడఁ
చిన్నిపాపల బొమ్మపెండ్లిండ్లు సేయు
చున్న వెన్నునిఁగాంచి యుల్లంబులోన
సంతసిల్లుచునుండి మంత్రులుఁదానుఁ
గుకార్య మూహింప దైత్యారిచేత
గణితంబుగఁ బూజలంది యామౌని  - 370
టపోయి చూచుచో శ్వరత్నంబుఁ
టులత నెక్కి బజ్జళ్లుఁ ద్రొక్కించు; 
రియొక్క యింటిలో గువలు దాను
నరమి దాఁగలిమూఁత లాడంగఁజూచి
యాదట నొకయింట మలధేనువులు
భూదేవులకు ధారఁబోయఁగఁ జూచి; 
వెండొక్క యింటిలో వెన్నుఁడు సతులు
కుండలీనృత్యంబుఁ గోరి యీక్షింపఁ
నుగొనె, నాయింట జ్జాలు పంచి
పెనుపార సతులకుఁ బెట్టంగఁజూచె; 
ద్దసమాధిభూయిష్ఠుఁడై యొక్క
శుద్ధాంతమున నుండఁజూచి యిబ్బంగి
వెరవార పదియాఱువేవుర యిండ్ల
రిపరివిధములఁ బంకజోదరుఁడు 
కోరి క్రీడింపఁ గన్గొని దేవమౌని
శౌరిసత్యజ్ఞానసంపదలాత్మ
చ్చెరువందుచు రిఁబ్రస్తుతించి
యిచ్చ నెంతయుమెచ్చి యిట్లని పలికె. 
ర్వభూతాత్మక! తతంబు మెలఁ(ఱఁ)గు
ర్వజ్ఞుఁడవు నీవు కలలోకేశ!  - 380
మానుషతను బొంది హనీయ యిట్టి 
జ్ఞానాధికుండౌట ర్చింపనరుదు! 
యోగమాయారూఢి నొనరిన నిన్ను
యోగీంద్రులును గాన నోపరు కృష్ణ! 
యుగంబులయందు నెవ్వరు మున్ను
నాయంత నెఱుఁగరు లినాక్ష నిన్ను! 
నీతత్వరూపంబు నెఱిఁ బెక్కుగతులఁ
జేతోగతంబయ్యెఁ జెన్నార నాకు! 
నొక్కఁడ వయ్యును నురుపుణ్యమూర్తి! 
పెక్కురూపులుదాల్చి పెంపొందుచుండి; 
గురుఁడును దండ్రియుఁ గోరి దైవంబుఁ
రమాత్ముఁడవు పరబ్రహ్మంబు నీవ!” 
ని ప్రదక్షిణపూర్వమై వచ్చి మ్రొక్కి
ననాథ! నవ్వుచుఁ నియె నారదుఁడు
రియుఁ బదారువేలంగనాజనులు
రిగి వర్తించిన హనీయకథలు
దివిన వ్రాసిన ద్భక్తి విన్న
దిలోఁన దలచిన నుజోత్తములకుఁ
రమొప్ప ధర్మార్థ కామమోక్షములు
దొరకును భవదుఃఖదోషంబు లణఁగు”  -390
ని చెప్పి శుకయోగి ప్పుణ్యచరిత
లనఘ! వెండియు వినుమని చెప్పదొడఁగె. 
“నారదు వీడ్కొల్పి లినాక్షుఁడంత
నారులు దాను నున్నత కేళిసలుపఁ
మలారి యామినీన్యకఁ బ్రీతిఁ 
గ్రమమొప్పఁ బెండ్లికి గానేఁగుదేర