పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : నారదుని మాటలను విని శ్రీకృష్ణుఁడుద్ధవాచార్యుని యభిప్రాయము నడుగుట

నివినియద” నంచుఁ ద్మాక్షు వీడు
కొని నారదుఁడు బోవ గోవిందుడంత
య్యుద్ధవునిఁ జూచి యంతరంగమున
నెయ్యంబు లియ్యంబు నెరయ నిట్లనియె. 
నీతియు ధర్మంబు నేర్పును హితవుఁ
జాతుర్యమును గల త్యసంధుడవు; 
డఁకతోఁగార్యంబుఁ నుచోట మాకుఁ
డునొప్పు మీరలె న్నులు బుద్ధి”
నుటయు నుద్ధవుఁడంబుజోదరునిఁ
నుఁగొని నమ్రుఁడై డునొప్పఁ బలికె. 
“ఇందిరాధీశ! నీవెఱుఁగని కృత్య
మెందును గలదె నన్నిలఁ బెద్దఁజేసి
న్నించి యడిగెద మార్గంబుఁ దెలియ
విన్నవించెద నర్థి విను”మని పలికె. 
“పమబంధుఁడు నీకు పాండవాగ్రజుఁడు
సురుచిరంబుగ రాజసూయంబు సేయఁ
లఁచినయట్టి యధ్వరకృత్యమునకుఁ
లఁకువ లేకుండఁ గాచి రక్షింపు! 
ప్రాణంబుతోడ జరాసంధుఁడుండ 
స్థాణునకును గావ క్యంబు గాదు!  - 470
వాని నేగతినైన ధియింపకున్న
పూను జన్నంబు సంపూర్ణంబు గాదు. 
బలాఢ్యుఁడు గాన దనంబులోనఁ
జెకి యెవ్వనికి నిర్జింపఁగా నరిది
నిలజార్జునులతో నాపురికేఁగి
ని విప్రవరులయాచందమై వేడి 
ల్లయుద్ధంబున రి భీముచేత
నెల్లభంగులవాని యేపడగింపు
మాతఁడు దీరిన ఖిలరాజులకుఁ 
“బ్రీతియౌ పగదీరుఁ బెంపొందు నీకుఁ
 జరాసంధుచేను బద్ధులైన
తీశ్వరులఁ బ్రోవఁ నుటయే లెస్స.”