పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవత - జగదభిరక్షణ కాండ : భీమజరాసంధుల మల్లయుద్ధము:

నిపల్కి సన్నద్ధుఁడై యూరు వెడలి
ని యొక్క యెడ సమస్ధలముఁ గావించి
మారుతాత్మజుఁడును గధభూపతియు
నీసంబున డాసి యేపార నంత; 
నంకాకారులై త్యుగ్ర భద్ర
దంతావళంబులు గ్గఱు మాడ్కి - 560
టుతర నిర్ఘాతపాతంబులట్ల
టులతమై మల్ల ఱచి యొండొరులఁ
ట్టుచు విడుచుచు బాహుపాశములఁ
జుట్టి విణ్ణాణముల్ చూపి యార్చుచును
రియగు సవ్యాపవ్య మార్గములఁ
మిడి గదిసమై తాఁకి వైచుచును
ల కొమ్మంటులు గ్రమ్మంగఁ జెట్టు
డఁగి వ్రేయుచుఁ జేత దిమి తప్పుచును
3-22 నాశీవిషంబుల నువున మ్రోసి
యాశుగమును బోలి యందంద వ్రేయ
ముమున డగ్గరి ముష్టిఘాతముల
తాడనంబులు టుశక్తిఁ జూపి
భీముని మగధుండు పిడికిటఁ బొడువ 
నామారుతాత్మజుఁ చలుఁడై నిలిచి
మోకాలఁ గొని గుండె మోవంగఁ బొడువ
వీఁరి మగధభూవిభుఁడుర్వి వ్రాలె! 
క్రమ్మన లేచి భీర ముష్టి హతుల
మ్మారుతాత్మజు నందంద నొంప
లక నాతఁడాని 3-23 జత్రు దేశ
ఱిముఱి బొడిచిన యంగంబు వడఁక  - 570
డిపడి నిల్చి యావమానసుతుఁడు
డుముఁ బీడించి విణ్ణాణంబు గొనఁగ
జాడించి యిరువురు మసత్వ లీల
వీడాడి నొప్పింప వెన్నుఁడు గాంచి! 



3-22 ఆశీవిషము = పాము, సర్పము

3-23 జత్రువు = మూపుల యొక్క సంధి ఎముకలు, కొంకులు, మెడకొంకి