ఛందోపరిచయము : వనమయూరము
19 వనమయూరము
ఉన్నతములై వనమయూర కృతు లోలిన్
ఎన్నగ భజంబులపయి న్సనగగంబుల్
చెన్నొదవ దంతియతి జెంది యలవారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్.
పదునాల్గవశక్వరీచ్ఛందంబునందు వనమయూరము
గణ విభజన
UII | IUI | IIU | III | UU |
భ | జ | స | న | గగ |
ఉన్నత | ములైవ | నమయూ | రకృతు | లోలిన్ |
లక్షణములు
పాదాలు: | నాలుగు |
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: | 14 |
ప్రతిపాదంలోని గణాలు: | భ, జ, స, న, గగ |
యతి : | ప్రతిపాదంలోనూ 9వ అక్షరము |
ప్రాస: | పాటించవలెను |
ప్రాస: | ప్రాస యతి చెల్లదు |
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ
భా6378వన.
అంత సుర లేయు నిబి డాస్త్రముల పాలై
పంతములు దక్కి హత పౌరుషముతో ని
శ్చింత గతి రక్కసులు సిగ్గుడిగి భూమిం
గంతుగొని పాఱి రపకార పరు లార్వన్.