పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : ఉత్సాహము

24 ఉత్సాహము                           (జాతి)

ఉ.
సాచర్య మమర సప్త వితృవర్గమతి సము
త్సా మెక్క నొక్క గురుఁడు రణములు భజింపఁగా
నీహితప్రదాన లీల లెసగు కమఠమూర్తి ను
త్సారీతు లుల్లసిల్ల సంస్తుతింతు రచ్యుతున్.
గణ విభజన
7 సూర్య గణములు
UI    III    III    UI    III    UI    III
హ    న    న    హ    న    హ    న
సా    చర్య    మమర    సప్త    వితృ    వర్గ    మతి సము
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    ప్రతి పాదములో - 7 సూర్యగణములు + గురువు (U)
•    యతి :
ప్రతి పాదములో - 5వ గణాద్యక్షరం
•    ప్రాస:
వేయాలి
•    ప్రాస: యతి
వర్తించదు

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     3
10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి త్రుభీషణోగ్ర దో
స్సాదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాపసాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.

 

ఉపజాతులు