పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : స్రగ్విణి

21 స్రగ్విణి

దేవకీనందను న్దేవచూడామణిన్
భూవధూవల్లభుం బుండరీకోదరున్
భావనాతీతునిం బల్కఁగా స్రగ్విణీ
భావ మాద్యంత రేఫం బగు న్షడ్యతిన్.

గణ విభజన
UIU UIU UIU UIU
దేవకీ నందను న్దేవచూ డామణిన్
4 ర - గణములు
లక్షణములు
పాదాలు: నాలుగు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 12
ప్రతిపాదంలోని గణాలు: ర, ర, ర, ర
యతి : ప్రతిపాదంలోనూ 7 వ అక్షరము
ప్రాస: పాటించవలెను
ప్రాస: ప్రాస యతి చెల్లదు
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 1
ఉదాహరణ

భా6454స్రగ్వి.
వ్రాలి "యోపుత్రా! నీ వార్త దంభోళియై
కూలఁగా వ్రేయ కీ కొల్ది నన్నేటికిన్
జాలి నొందించె? నా జాడ యింకెట్టిదో?
తూలు మీ తల్లికి న్దుఃఖ మె ట్లాఱునో?"