పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : సర్వలఘు సీసము

28 సర్వలఘు సీసము.            (ఉపజాతి)

క.
     సర్వ లఘు సీసమునకు న                          
    ర్వాంఘ్రులనడుమ నింద్రణములు మూఁడై                        
    యార్యంచలఘగణంబులు                          
    నుర్వీధర త్రిలఘుయుగము నొకగీతితుదిన్
గణ విభజన
IIIII    IIIII    IIIII    IIIII    IIIII    IIIII    III    III
నల    నల    నల    నల    నల    నల    న    న
వవికచ    సరసిరుహ    యనయుగ!    నిజచరణ    గనచర    నదిజనిత!    నిగమ    వినుత!
లక్షణములు
సీసపద్యము నియమయులే గాక అన్నీ లఘువులే యుండాలి
•    పాదాలు:    నాలుగు - కాని పఠన, లేఖన సౌకర్యార్థం పాదమును 2గా విభజిస్తారు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు

•    ప్రతిపాదంలోని గణాలు:    6 -ఇంద్ర గణాలు, 2 - సూర్య గణాలు
సీస పద్యము చివర ఆటవెలది లేదా గీతి ఉండాలి
అన్ని లఘువులే అయ్యి ఉండాలి
•    యతి :
ప్రతిపాదంలోనూ
1వ - 3వ గణాద్యక్షరాలకి, 5వ - 7వ గణాద్యక్షరాలకి
•    ప్రాస:
ఐచ్ఛికం
•    ప్రాస: యతి
వేయవచ్చు

పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     1
ఉదాహరణ
11-72-ససీ.
వ వికచ సరసిరుహ యనయుగ! నిజచరణ
    గనచరనది జనిత! నిగమవినుత!
లధిసుత కుచకలశ లిత మృగమద రుచిర
    రిమళిత నిజహృదయ! రణిభరణ!
ద్రుహిణముఖ సురనికర విహిత నుతికలితగుణ!
    టిఘటిత రుచిరతర నకవసన!
భుజగరిపు వరగమన! రజతగిరిపతివినుత!
    తతజపరత! నియమరణి చరిత!
11-72.1-తే.
తిమి కమఠ కిటి నృహరి ముదిత! బలి నిహి
పద! పరశుధర! దశవన విదళన!
మురదమన! కలికలుష సుముదపహరణ!
రివరద! ముని నర సుర రుడ వినుత!