ఛందోపరిచయము : లయగ్రాహి
17 లయగ్రాహి
ఎందు నిల నేజనులకుం దలఁపరాని త
ప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా
సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొర
సి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ
మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసము
లు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా
హిం దనర సబ్భజసలుందగ నకారము
ను బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.
ఏకోనచచ్వారింశన్మాత్రా గర్భితంబుఁ ద్రింశదక్షరంబు నైన లయగ్రాహి
గణ విభజన
UII | IUI | IIU | III | UII |
భ | జ | స | న | భ |
ఎందుని | లనేజ | నులకుం | దలఁప | రానిత |
IUI | IIU | III | UII | IUU |
జ | స | న | భ | య |
పమంది | కొనిచే | సిరొకొ | నందుఁడు | యశోదా |
లక్షణములు
పాదాలు: | నాలుగు |
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: | 30 |
ప్రతిపాదంలోని గణాలు: | భ, జ, స, న, భ , జ, స, న, భ, య |
యతి : | |
ప్రాస: | పాటించవలెను |
ప్రాస: | ప్రాసయతి స్థానములు - 2వ, 10వ, 18వ, 26వ అక్షరములు. |
వ్రాయుటకు, చదులుటకు వీలుకొరకు ప్రతి పాదము రెండుగా విడదీసితిమి.
పోతన తెలుగు భాగవతంలో వాడిన పద్యాల సంఖ్య 4
ఉదాహరణ
భా6385లగ్రా.
కూలిరి వియచ్చరలు; సోలిరి దిశాధిపు
లు; వ్రాలి రమరవ్రజము; దూలి రురగేంద్రుల్;
ప్రేలిరి మరుత్తు; లెదజాలిగొని రాశ్విను
లు; కాలుడిగి రుద్రు లవలీలబడి రార్తిన్;
వ్రేలిరి దినేశ్వరులు; కీలెడలినట్లు సు
రజాలములు పెన్నిదుర పాలగుచు ధారా
భీల గతితోడఁ దమ కేలి ధనువుల్విడి
చి నేలఁబడి మూర్ఛలను దేలిరి మహాత్మా!