పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : కంద పద్యము

23 కంద పద్యము                  (జాతి)

క.
కంద పద్యము త్రిశర గణంబుల
నంముగా భజసనలము టవడి మూఁటన్
బొందును నలజల నాఱిట
నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్.
గణ విభజన
UII    IIII    UII        
భ        నల    భ        
కంము    త్రిశరగ    ణంబుల        
UII    UII    IIII    IIII    UU
భ    భ    నల    నల    గా
నంము    గాభజ    సనలము    టవడి    మూఁటన్
భ, స, నల, గా గణాలే ఉన్నాయి
6వ గణము - నల
1, 3, 5, 7 గణాలు - జ కాదు
చివరి అక్షరం (టన్) - U
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    1.    1వ, 3వ పాదాలలో 3 గణములు, 2వ, 4వ పాదాలలో 5 గణములు (త్రిశర గణంబుల - 3+5 - 8 గణములు)
2.    భ, జ, స, నల, గా - అనే 5 గణములు మాత్రమే ఉండాలి.
3.    (అన్నీ చతుర్మాత్ర గణములే)
4.    1వ,2వ పాదాలకు కలిపి మరియు 3వ, 4వ పాదములకు కలిపి 6వ గణము నల లేదా జ గణము కావలెను.
5.    బేసి గణము (1, 3, 5, 7 గణములు) జ కారాదు
6.    చివరి అక్షరము (2వ, 4వ పాదం చివరి అక్షరము) గురువు కావాలి. (స గణము కాని గా గణము కాని ఉండాలి).
•    యతి :
2వ, 4వ పాదాలలో - నాలుగవ గణాద్యక్షరం
•    ప్రాస:
వేయాలి.
•    ప్రాస: యతి
వర్తించదు
                                           
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     2611
ఉదాహరణ
9-263-క.
భూలనాథుఁడు రాముఁడు
ప్రీతుండై పెండ్లియాడెఁ బృథుగుణమణి సం
ఘాతన్ భాగ్యోపేతన్
సీతన్ ముఖకాంతివిజిత సితఖద్యోతన్.    
కంద నిరూపణ
భ    భ    భ        
భూల    నాథుడు    రాముడు        
గా    గా    జ    నల    స
ప్రీతుం    డై పెం    డ్లి యాడె    బృథుగుణ    మణిసం
గా    గా    గా        
ఘాతన్    భాగ్యో    పేతన్        
గా    స    నల    స    గా
సీతన్    ముఖకాం    తి విజిత    సితఖ    ద్యోతన్
భ, జ, స, నల, గా గణాలే ఉన్నాయి
6వ గణము - జ
1, 3, 5, 7 గణాలు - జ కాదు
చివరి అక్షరం (తన్) - U
ప్రాస, యతి సరిపోయాయి.