పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : గణ యతి ప్రాసల సూచన

రచనా విధానానికి సొబగులు దిద్దడంలో ఒక విశిష్ఠ ప్రక్రియ పద్యం లేదా శ్లోకం. ఇది పద్యానికి ఒక లయను అందిస్తుంది. దానివలన వినసొంపే కాదు గుర్తుపట్టడానికి, మననం చేసుకోవడానికి, భాషాదోషపరిహారానికి ఉపయోగుడుతూ రచన సొష్ఠవాన్ని వృద్ధి చేస్తుంది పద్య ప్రక్రియ. ఈ ప్రక్రియ వలన అద్భుతమైన అనితర సాధ్యమైన ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. సంగీతం వలె మాధుర్యం అందించే కవిత్వం సాధ్యం అయింది. అట్టి పద్యాలు లేదా శ్లోకాలు రచించే నియమాలను తెలిపే శాస్త్రాన్ని ఛందస్సు లేదా ఛందము అంటారు.

సంగీతానికి సప్త స్వరాలు మూలం ఎలాగో అలాగ, పద్యరచనకు గురులఘువులు ప్రధానం. ఈ విధానంలో ప్రతి అక్షరాన్ని చిన్నది పెద్దది అని రెండు భాగాలుగా విడదీసారు. లఘువు ఏకమాత్ర కలిగి ఉండే అక్షరాలు. ఉదా. ఇ, కి, కొ.... వీటిని ఛందములో లఘువు గుర్తు "I" లేదా "ల". ద్విమాత్ర అక్షరాలు గురువులు. ఉదా. రా, క్రా, ఏ.... "U" లేదా "గు" గురువు గుర్తు. "U" "I" గుర్తులు గురులఘువులను గుర్తించడానికి అక్షరాల పైన చూపుతారు. వ్యాకరణంలో అక్షరాల సమాగమంతో పదాలు వాక్యాలు ఏర్పడతాయి. కాని ఛందములో అవే అక్షరాలను గురు రఘువులుగా గ్రహించి. వివిధ క్రమాలలో వచ్చే గురు లఘువుల సమూహాన్ని గణాలుగా తీసుకుంటారు. ఈ గణాల క్రమబద్ధీకరణ సాధించడంలో పద్య పాదాలు ఏర్పడతాయి.

గణములో ఉన్న అక్షరాల సంఖ్యను బట్టి నాలుగు (4) రకాలు. అవి 1) ఒక అక్షర - ఏకాక్షర, 2) రెండు అక్షర - ద్వ్యక్షర, 3) మూడు అక్షర - త్ర్యక్షర, 4) నాలుగు అక్షర - చతురక్షర. వీటిని నిసర్గగణాలు అంటారు. మరొకరకం విభాగంలో ఉపగణాలు అంటారు ఇవి గణంలోని మాత్రలు ఆధారంగా గ్రహిస్తారు. నిసర్గ గణాలు వృత్తాలు యందు, ఉపగణాలు జాతులు అందు వాడతారు.

శ్లోకాలకు ఇలాంటి గణాల నియమాలు ఉంటాయి. పాద సంఖ్యా నియమం కూడ ఉంటుంది.

పద్యాలకు ఈ గణాల నియమమే కాకుండా యతి, ప్రాస నియమాలు కూడ పాటించాలి. పద్యాలకు నాలుగు పాదాలు వాడతారు. సకృత్తుగా అధికపాదాలు (5, 6... ) కూడ ప్రయోగిస్తారు.

1. విసర్గ గణములు
1,1 ఏకాక్షర గణాలు: ఇవి గురువు లేదా "గగణము", లఘువు లేదా "లగణము" అని రెండు రకములు.

ఉదా.U I I U
`శ్రీరాగౌ

1.2. ద్వ్యక్షర గణాలు: ఇవి "లగ" లేదా "వ", "గల" లేదా "హ", "గగ" లేదా "గా", "లల" లేదా "లా" అని నాలుగు రకాలు. వీటి గణ విభజన లగ - IU, గల - UI, గగ - UU, లల - II.

1.3. త్ర్యక్షర గణాలు : ఇవి క్రింద వివరించిన విధంగా ఎనిమిది (8) రకాలు. వీటినే గణాష్టకము అని కూడ అంటారు:

సం.
గుర్తు:పేరు-విభజన-లక్షణం=ఉదా/th>
1
:య గణము-I U U-ప్రథమ లఘువు=రమేశా/td>
2
మా:మ గణము-U U U-త్రి గురువు=శ్రీరామా/td>
3


తా:త గణము-U U I -అంత్య లఘువు=శ్రీరామ/td>
4
రా:ర గణము-U I U-మధ్య లఘువు=రాముడా/td>
5
:జ గణము-I U I-మధ్య గురువు=విశాలి/td>
6
భా:భ గణము-U I I-ప్రథమ గురువు=రాముడు/td>
7
:న గణము-I I I-త్రి లఘువు=యమున/td>
8
:స గణము-I I U-అంత్య గురువు=సుమతీ/td>

వీటిని గుర్తు పెట్టుకునే చిన్న చిట్కాలు:
య(I) మా(U) తా(U) రా(U) జ(I) భా(U) న(I) స(I) - అక్షరాలు చక్రప్రదక్షిణ చేస్తున్నాయి అనుకుంటే (అంటే చక్రం పూర్తయినట్లు ‘స’ తరువాత ‘య’ వస్తుంది), ఏ అక్షరం మీద మొదలెట్టి వరుస మూడు అక్షరాల గురు లఘువులను చూసుకుంటే అది ఆ గణలక్షం అవుతుంది.
లేదా
య(I) మా(U) తా(U) రా(U) జ(I) భా(U) న(I) స(I) య(I) మా(U) - అని ఏకపాద సూత్రంగా కూడ తీసుకోవచ్చు.
ఉదాహరణకు:
యగణం - య(I) మా(U) తా(U);
నగణం - న(I) స(I) య(I).

1.4. చతురక్షర గణములు: ఇవి మూడురకాలు వాడుకలో ఉన్నాయి. అవి

సం
గణము పేరు:గుర్తు-ఉదాహరణ/th>
1
నల:IIII-నరహరి/td>
2
నగ:IIIU-నరహరీ/td>
3
సల:IIUI-నరసింహ/td>

2. ఉపగణాలు: ఇవి సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు అని మూడు రకాలు

3.సూర్య గణములు
:I I I
హ (గల):I U
4.ఇంద్ర గణములు
నల:I I I I
నగ:I I I U
సల:I I I U
:U I I
:U I U
:U U I

5. చంద్ర గణాలు: ఇవి పద్నాలుగు రకములు. వీటి వాడుక బహు తక్కువ. కనుక వివరించుట లేదు.

6. లఘువులను ఏక మాత్రలు అనీ, హ్రస్వాలు అనీ కూడ వ్యవహరిస్తారు. గురువులను ద్వి మాత్రలు అనీ, దీర్ఘాలు అనీ కూడ వ్యవహరిస్తారు. మూడు మాత్రలు గల వాటిని త్రిమాత్రలు లేదా ప్లుతం అని అంటారు. వ్యంజనములు అంటే అచ్చులేని హల్లులు. వీటిని పొల్లులు అంటాం ఉదా. క్, ర్..... ఇవి అర్థమాత్రలు.
ఈ మాత్రా ఛందస్సుతో కొన్ని రకాల పాటలు రచిస్తారు.
ఉదా. ఏకవీర సినిమా నుండి

తోటలో నారాజు తొంగి చూసెను నాడు
నీటిలో ఆ రాజు నీడ నవ్వెను నేడు.....

7. యతిప్రాసలు:
ఇలా గణాల క్రమం, పాదాల సంఖ్య నిర్ణయిస్తూ జరిగేవి శ్లోకాలు. పద్యాలకు ఆ గణాల నిమయాలే కాకుండా యతినియమం, కొన్నిటి విషయంలో ప్రాసమైత్రి పాటించాల్సి ఉంటుంది. అప్పుడే సాంకేతికంగా పద్యం అనబడుతుంది.

అ. యతి నియమం - గణస్థాన అక్షరము మొదటి అక్షరముల శబ్దమైత్రి.
ఆ. ప్రాస - పద్యముల రెండవ అక్షరమైత్రి.
ఇ. ప్రాసయతి - గణస్థాన అక్షరము రెండవఅక్షరముల శబ్దమైత్రి.

ఛందోప్రక్రియలు చాలా రకాలుగా ప్రయోగింపబడుచూ ఉంటాయి. అయితే, పోతన తెలుగు భాగవతములో ప్రధానంగా వృత్తములు, శ్లోకము, జాతులు, ఉపజాతులు, దండకములు, గద్యవచనములు అనే ఛందోప్రక్రియలు వాడారు