పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : దండకము, గద్యము, వచనము

పోతన తెలుగు భాగవతములో శ్లోకము, పద్యాలే కాకుండ. దండకము అని తెలుగు భాషలోనే ప్రత్యేకమైన ఛందోబద్ద రచన ప్రక్రియలో రెండు దండకములు వాడబడ్డాయి. ఇక్కడ ఒక్క విషయము. తెలుగులో లభ్యమవుతున్న వాటిలో మొదటి (ప్రాచీనతరమైన) దండకము పోతన విరచిత "భోగినీ దండకము" అంటారు. గద్యము, వచనము అనే ఛందోబద్దముకాని ప్రక్రియలు రెండు పోతన తెలుగు భాగవతములో వాడబడ్డాయి.