పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఛందోపరిచయము : ఆటవెలది

25 ఆటవెలది                                                 (ఉపజాతి)

నగణ త్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాఁటవెలఁది.
లేదా
నులు ముగురు పాడ నిద్ద రింద్రులు మృదం
ములు దాల్ప వంశ కాహ ళాదు
లేగు రర్కు లూదఁ నిరు మేళగతి నాట
వెలఁది యొప్పుచుండు విష్ణు సభల.
గణ విభజన
3 సూర్య గణములు    2- ఇంద్ర గణములు
III    III    UI    UIU    IIIU
న    న    హ    ర    నగ
నులు    ముగురు    పాడ    నిద్దరిం    ద్రులుమృదం
5 - సూర్య గణములు
III    UI    UI    UI    UI
న    హ    హ    హ    హ
ములు    దాల్ప    వంశ    కాహ    ళాదు
లక్షణములు
•    పాదాలు:    నాలుగు
•    ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య:    నియమం లేదు
•    ప్రతిపాదంలోని గణాలు:    1వ, 3వ పాదాలలో - 3 ఇంద్రగణములు 2 సూర్యగణములు, 2వ, 4వ పాదాలలో 5 సూర్యగణములు
•    యతి :
ప్రతి పాదములో - నాలుగవ గణాద్యక్షరం
•    ప్రాస:
నియమం లేదు
•    ప్రాస: యతి
యతి బదులు ప్రాస యతి వేయవచ్చు
పోతన తెలుగు భాగవతములో వాడిన పద్యముల సంఖ్య -     703
ఉదాహరణలు
'విశ్వదాభిరామ వినుర వేమ' అనే మకుటంతో ఆంధ్రులకు చిరపరిచితములైన వేమన పద్యాలన్నీ ఆటవెలదులే.
ఉదా:
ఉప్పుకప్పురంబు ఒక్కపోలికనుండు,
చూడచూడ రుచుల జాడవేరు,
పురుషులందు పుణ్యపురుషులు వేరయా
విశ్వదాభిరామ వినుర వేమ.

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచెముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై యుండదా
విశ్వదాభిరామ వినురవేమ.

8-83.1-ఆ.
రా మహేశు నాద్యు వ్యక్తు నధ్యాత్మ
యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమయిన వానిఁ రుని నతీంద్రియు
నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు.

8-79.1-ఆ.
నెఱి నసత్య మనెడి నీడతో వెలుఁగుచు
నుండు నెక్కటికి హోత్తరునకు
నిఖిలకారణునకు నిష్కారణునకు న
స్కరింతు నన్ను నుచు కొఱకు.