వాఙ్మయము : భారతీయ వాఙ్మయము - 1
భారతీయ వాఙ్మయము - సూచన
(అ) వేదాలు
(క) చతుర్వేదాలు
1.ఋగ్వేదము
2 యజుర్వేదము
3. సామవేదము
4. అధర్వణవేదము
(ఖ) వేదభాగాలు చూపు;
అ) సంహితలు, ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అధర్వవేద సంహిత, యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత, ఘేరండ సంహిత, చరక సంహిత, కశ్యప సంహిత, అష్టావక్ర సంహిత, భృగు సంహిత, యాజ్ఞవల్క్య సంహిత, బ్రహ్మ సంహిత, గర్గ సంహిత, దేవ సంహిత
ఆ) బ్రాహ్మణకాలు -మంత్రమునుగాని, శాస్త్రవిధినిగాని వివరించేవి
ఇ) అరణ్యకాలు -వివిధ కర్మ, యజ్ఞకార్యముల అంతరార్థాలను వివరించునవి
ఉ) ఉపనిషత్తులు -జ్ఞానకాండ బ్రహ్మవిద్యాది చెప్పబడతాయి ఇవి అనేకం ఉన్నాయి కాని దశోపనిషత్తులు ప్రధానమైనవి, అవి
1. ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు), 2. కేనోపనిషత్తు, 3. కఠోపనిషత్తు, 4. ప్రశ్నోపనిషత్తు, 5. ముండకోపనిషత్తు, 6. మాండూక్యోపనిషత్తు, 7. తైత్తిరీయోపనిషత్తు, 8. ఐతరేయోపనిషత్తు, 9. ఛాందోగ్యోపనిషత్తు, 10. బృహదారణ్యకోపనిషత్తు
(గ) వేదాంగాలు 6 (వేదాలకు ఉపకరణాలు వంటివి) చూపు;
1 శిక్ష - కర్త - పాణిని
2 వ్యాకరణము - కర్త - పాణిని
3 ఛందము - కర్త - పింగళముని
4 నిరుక్తము - కర్త - యాస్కముని
5 జ్యోతిషము - కర్తలు - ఆదిత్యాదులు
6 కల్పము - కర్తలు - అశ్వలాయన, కాత్యాయన, ఆపస్తంబ, బోధాయన, వైఖానస, ద్రాహ్యాయన, భారద్వాజ, సత్యాషాఢ, హిరణ్యకేశి మున్నగువారు
(ఘ) ఉపవేదాలు (వేదాలకు అనుబంధాలు) చూపు;
అ) అర్చావేదము, ఆ) ధనుర్వేదము, ఇ) గాంధర్వవేదము, ఈ) స్థాపత్యము, ఉ) ఆయుర్వేదము, (ఆ) స్మృతులు -ధర్మశాస్త్రములు,
స్మృతులు -పదునెనిమిది. అవి మనుస్మృతి, బృహస్పతిస్మృతి, దక్షస్మృతి, గౌతమస్మృతి, యమస్మృతి, అంగీరసస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, ప్రచేతస్స్మృతి, శాతాతపస్మృతి, పరాశరస్మృతి, సంవర్తస్మృతి, ఔశనసస్మృతి, శంఖస్మృతి, లిఖితస్మృతి, ఆత్రేయస్స్మృతి, విష్ణుస్మృతి, ఆపస్తంబస్మృతి, హరీతస్మృతి.
ఉపస్మృతులు పదునెనిమిది. అవి కణ్వస్మృతి, కపిలస్మృతి, లోహితస్మృతి, దేవలస్మృతి, కాత్యాయనస్మృతి, లోకాక్షిస్మృతి, బుధస్మృతి, శాతాతపస్మృతి, అత్రిస్మృతి, ప్రచేతస్మృతి, దక్షస్మృతి, విష్ణుస్మృతి, వృద్ధవిష్ణుస్మృతి, వృద్ధమనుస్మృతి, ధౌమ్యస్మృతి, నారదస్మృతి, పౌలస్త్యస్మృతి, ఉత్తరాంగిరసస్మృతి.
(ఇ) దర్శనములు చూపు;
వైదిక దర్శనాలు:
(1) గౌతమ ఋషి న్యాయ దర్శనం, (2) కాణాద ఋషి వైశేషిక దర్శనం, (3) కపిల ఋషి సాంఖ్య దర్శనం, (4) పతంజలి ఋషి యోగ దర్శనం, (5) జైమిని ఆచార్యుల (జైమిన్యాచార్యుల) వారి పూర్వ మీమాంసా దర్శనం (6) బాదరాయణాచార్యుల ఉత్తరమీమాంసా దర్శనం (వేదాంతదర్శనం) అని షడ్దర్శనాలు.
అవైదిక దర్శనాలు:
లోకాయుత దర్శనం లేదా చార్వాక దర్శనం, జైన దర్శనం, బౌద్ధ దర్శనం
(ఈ) శాస్త్రములు - శాస్త్రములు 6 (నియమన గ్రంథాలు) చూపు;
1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము
(ఉ) పురాణాలు చూపు;
అ)ప్రధానమైనవి- అష్టాదశ పురాణములు అందు భాగవతము ప్రధానము
1బ్రాహ్మము 2పాద్మము 3వైష్ణవము 4శైవము 5భాగవతము 6నారదీయము 7మార్కండేయము 8ఆగ్నేయము 9భవిష్యత్తు 10బ్రహ్మకైవర్తము 11లైంగము 12వారాహము 13స్కాందము 14వామనము 15కౌర్మము 16మాత్స్యము 17గారుడము 18బ్రహ్మాండము
ఆ) తరువాత ప్రధానమైనవి- అష్టాదశ ఉపపురాణములు
1.ఆది పురాణం (సనత్కుమార), 2.నారసింహ పురాణం, 3.స్కంధ పురాణం, 4.శివధర్మ పురాణం, 5.దుర్వాస పురాణం, 6.నారదీయ పురాణం, 7.కపిల పురాణం, 8.వామన పురాణం, 9.ఔషనస పురాణం, 10.బ్రహ్మాండ పురాణం, 11.వరుణ పురాణం, 12.కాళికా పురాణం, 13.మహేశ్వర పురాణం, 14.సాంబ పురాణం, 15.సౌర పురాణం, 16.పరశార పురాణం, 17.మరీచ పురాణం, 18.భార్గవ పురాణం... పాఠ్యంతరాలు ఉన్నాయి.
(ఊ) ఇతిహాసాలు -సత్యంగా జరిగిన చరిత్రలు చూపు;
1) రామాయణము
2) భారతము
3) ...
(ఋ) కావ్యాలు చూపు;
కావ్యలలో రకాలు -, దృశ్య కావ్యాలు., శ్రావ్య కావ్యాలు, ధ్వని కావ్యము, గుణీభూత కావ్యము, చిత్ర కావ్యము, పద్య కావ్యము, గద్య కావ్యము, చంపూ కావ్యము, పాఠ్యము, గేయము, మహా కావ్యము, ఆఖ్యాయిక, కథ, ఆఖ్యానము, నిదర్శనము, ప్రవహ్లిక, మతల్లిక, మణికుల్య, పర్యాయబంధము, పరికథ, ఖండకథ, సకలకథ, ఉపకథ, బృహత్కథ, ఉదాహరణము, చక్రవాళకము, భోగావళి, బిరుదావళి
(ఎ) నాటకాలు చూపు;
1) శాకుంతలము, 2) మృచ్చకటకము, ...
(ఏ) తెలుగు / ఆంధ్ర రచనా ప్రక్రియలు చూపు;
అవధానము, ఆశుకవిత్వము, కథ, కవిత, గీతం, చరిత్ర, చాటువు, టుమ్రీలు, దండకము, నవల, నానీలు, పత్రికా కథనం, పాట, పొడుపుకథ, ప్రకరణము, ప్రబంధము, ప్రవచనం, బుఱ్ఱకథ, భజన, యక్షగానము, లేఖ, వ్యాసము, శతకము, సామెతలు, సినిమా, స్తుతి, సూక్తి స్తోత్రం, హరికథ, హాస్యం, హైకూలు...
(ఐ) ఆచార్యుల, గురువుల ప్రోక్తములు
(ఒ) కళలు -చతుషష్టి (60) లేదా
చతుష్ష్ఠి విద్యలు