పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయాశ్వాసము : మునులు దాము జరిగించిన కార్యమును శంకరునకు దెలుపుట

3-58-వ.
మఱునాఁ డమ్మహామునీంద్రులు మనంబార వీడ్కొని రజతధరణీధర శిఖరంబునకుఁ బ్రయాణంబు చేసి సర్వేశ్వరుం గాంచి సాష్టాంగదండ ప్రణామంబు లాచరించి “దేవా! దేవర యానతిచ్చిన పనులెల్లను శుభకరంబు లై సిద్ధించె” నని తత్ప్రకారంబు తెలియ విన్నవించినవారై యిట్లనిరి.

టీక :-
మనంబార = మనసారా; రజతధరణీధరము = వెండి కొండ.
భావము :-
మరునాడు ఆ మునీంద్రులు మనసారా హిమవంతుని వీడ్కొని, కైలాసమునకు వచ్చారు. శివుని చూసి సాష్టాంగ నమస్కారము చేసి “దేవా! మీరు చెప్పిన పనులన్నీ శుభముగా ఫలించాయి” అని ఈ విధంగా విన్నవించారు.

3-59-సీ.
దేవేశ! మీ రానతిచ్చిన పనిఁ బూని
యిరవొప్పఁ బయనమై యేము బోయి
నయింటి కరిగినఱి మముబొడఁగని
యెంతయు దవ్వు మా కెదురు వచ్చి
తిభక్తితోమ్రొక్కి ర్ఘ్యపాద్యాదుల
మరఁబూజించి పీములు వెట్టి
క్షేమంబు లరసి తాఁ జేతులు మొగిడించి
యేతేరఁ గారణం బేమి యనిన

3-59.1-ఆ.
నీలకంధరుండు నీ కూఁతు పార్వతి
భామఁ దనకు నడుగఁ బంపె” ననుడు
క్తితోడమ్రొక్కి లుదెఱంగులనిట్లు
గారవించి పలికెఁ గామవైరి!

టీక :-
ఇరవొందు = సిద్ధించు; తఱి = సమయము; పొడగని = చూసి; దవ్వు = దూరము; అమర = పద్ధతి; అరయు = విచారించు; మొగిడించు = జోడించు; ఏతేరు = వచ్చు; అనుడు = అనగా; కామవైరి = మన్మథుని శత్రువైన శివుడు.
భావము :-
“కామవైరీ! దేవేశ! మీరు చెప్పిన పనిని సాధించుటకు ప్రయాణమై వెళ్ళాము. వెళ్ళగానే మమ్మల్ని చూసి చాలా దూరం నుండి ఎదురువచ్చాడు. మిక్కిలి భక్తితో నమస్కరించి అర్ఘ్య పాద్యాదులతో పద్ధతిగా పూజించాడు. ఆసనములందు కూర్చుండజేసి క్షేమములు విచారించి తాను చేతులు జోడించి “వచ్చుటకు కారణమేమి” యని అడిగాడు. “శివుడు నీ కూతురు పార్వతిని తనకు యడుగుమని పంపాడు” అని చెప్పగా భక్తితో నమస్కరించి రకరకాలుగా గౌరవించి ఈ విధముగా పలికాడు.

3-60-క.
రిమీ మన్ననలకుఁ దగు
రుదా యిటువంటి భక్తి లదే మనకున్
గిరిరాజు సేయు భక్తికి
రియెన్నఁగఁ గలదె భక్తి చంద్రాభరణా!

టీక :-
అరుదు = అపూర్వము.
భావము :-
చంద్రాభరణా! శివా! హిమవంతుడు మీ గౌరవానికి సరిపోతాడు. అతనిది సాటిలేని, అపూర్వమైన భక్తి. ఇలాంటి భక్తే కదా మనకు కావలసింది.

3-61-క.
లుమరు ముల్లోకంబులఁ
జెలులం జూచితిమి గాని చింతింపఁగ నా
నకుఁ గల లక్షణములు
యఁగ నే చెలుల యందుఁ గానము దేవా!

టీక :-
చింతించు = ఆలోచించు.
భావము :-
మూడు లోకాలలోని కన్యలను చూశాము. కానీ ఆ పార్వతీ దేవికి గల సులక్షణాలు గల కన్యలను ఎక్కడా చూడలేదు.

3-62-క.
ఆ న్నులు నా చన్నులు
నాకురు లా ముద్దుమోము నానెరు లా ర
మ్యాకారము నా మధ్యము
నేకాంతల యందు నెఱుఁగ మిభచర్మధరా!

టీక :-
కురులు = వెంట్రుకలు; నెరులు = శిరోజములు; మధ్యము = నడుము; ఇభము = ఏనుగు.
భావము :-
(పార్వతీ దేవి సౌందర్యాన్ని వర్ణిస్తూ మునులిలా అన్నారు.)
ఆ కళ్ళు, ఆ చన్నులు, ఆ కురులు, ఆ ముద్దుముఖము, ఆ శిరోజములు ఆ నడుము, ఆ అందమైన రూపము, శివా! గజ చర్మధరా! ఇంకే కాంతలలోనూ కనబడదు.

3-63-క.
నీలాహి మేనికంటెను
నీలాళులకంటె నింద్రనీలముకంటెన్
నీరుచిఁ బోలు నంబిక
నీలాలక లేమి చెప్ప; నీలగ్రీవా!

టీక :-
అహి = పాము; అళి = తుమ్మెద; రుచి = కాంతి; అలకలు = ముంగురులు; గ్రీవము = కంఠము.
భావము :-
నీలకంఠా! శివా! పార్వతీదేవి శిరోజములు గురించి ఏమని చెప్పము. కృష్ణ సర్పము శరీరము కంటె, నల్లని తుమ్మెదల కంటె, ఇంద్రనీలము కంటె నల్లని కాంతికలిగి ఉన్నాయి.

3-65-క.
సుతీలలామబొమలకు
లక సరిసేయ నొకటి చ్చునె నీ చేఁ
నమునఁ దెగడ యేనియు
నున కది విల్లుగాదె దనారాతీ!

టీక :-
సుదతి = మంచి పలువరుస గల స్త్రీ; లలామ = అందమును ప్రదర్శించునది, ఉత్తరపదమైన శ్రేష్ణమైనది; కదనము = యుద్ధము; తెగడు = నిందించు.
భావము :-
మదనవైరీ! మంచి పలువరుస గల ఆ పార్వతి కనుబొమలకు పోల్చడానికి మరొక వస్తువు లేదు. మన్మథుడు యుద్ధంలో నీచేత బూడిద కాకపోయుంటే అతని విల్లుకు సరిపోయేదేమో!.

3-66-ఉ.
సోమునిఁ దోడుతెచ్చుకొని స్రుక్కక చిల్కలుఁదేంట్లు గొల్వఁగాఁ
గాముఁడు విల్లునమ్ములు నఖండతఁ బట్టినయట్లు దోఁచు నా
భాముఖాబ్జరేఖయును ల్కును గొప్పును భ్రూలతాంగమున్
గాముఁడు నీవు చంపుటయుఁ ల్లనిపించె శశాంకశేఖరా!

టీక :-
సోముడు = చంద్రుడు; స్రుక్కు = గర్వము; అబ్జము = తామర; భ్రూ = కనుబొమ; కల్ల = అసత్యము.
భావము :-
శశాంకశేఖరా! శివా! చంద్రుని తోడు తెచ్చుకొని గర్వంగా చిలుకలు తుమ్మెదలు సేవిస్తుండగా కాముడు విల్లు, అమ్ములు సంపూర్ణంగా పట్టినట్లు అనిపించే ఆ భామ ముఖారవిందము, కొప్పు, కనుబొమలు, లతవంటి శరీరము చూస్తుంటే మన్మథుని నీవు చంపడం అబద్ధమనిపిస్తోంది.

3-67-క.
సుంరి మృగలోచనముల
యంము లందందుఁ గల్గు ది నూనము దా
నిందీవరముల యందును
గంర్పుని శరము లందుఁ గంజము లందున్.

టీక :-
సుందరి = అందమైన స్త్రీ; మృగము = లేడి; లోచనములు = కన్నులు; నూనం = ఊహ; కంజము = తామరపువ్వు.
భావము :-
ఆ అందము పార్వతీదేవి చక్కని లేడికళ్ళలో ఉంటుంది (నిజం). నల్లని కలువలలో, మన్మథుని బాణాలలో, తామరపూలలో ఉంటుందనేది ఊహే (నిజం కాదు).

3-68-సీ.
లజాక్షి నెమ్మోముఁ జందురుఁ బోల్తమా
చందురు నందునఁ గందు గలదు
న్నియవదనంబుఁ మలంబుఁబోల్తమా
మలంబుపుట్టుచోఁ సటుగలదు
మోహనాంగి ముఖంబు ముకురంబుఁ బోల్తమా
ముకురంబు నందున మృదువు లేదు
మానిన రదనంబు ణిపంక్తిఁ బోల్తమా
ణులెల్లరా లనుమాట గలదు

3-68.1-ఆ.
ఇంక నేమి బోల్త మింతి యాననముతో
సృష్టి నేమిసాటి సేయవచ్చు
గువమొగము కాంతి లహర! నీ యాన
త్రిభువనంబు లందు నభినవంబు.

టీక :-
నెమ్మోము = నిండైన ముఖము; కందు = నలుపు; కసటు = మాలిన్యము; ముకురము = అద్దము; మృదువు = మెత్తనిది; ఆననము = ముఖము; మలహరుడు = శివుడు; అభినవము = క్రొత్త.
భావము :-
పద్మనేత్రి నిండు ముఖమును చంద్రునితో పోల్చుదామంటే చంద్రునిలో నల్లని మచ్చ ఉన్నది. ఆ కన్య ముఖమును కమలముతో పోల్చుదామంటే కమలము పుట్టేచోట బురద ఉంటుంది. ఆ మోహనాంగి ముఖము అద్దముతో పోల్చుదామంటే ముకురమునకు మెత్తదనము లేదు. ఆ మానిని ఆననము మణులతో పోల్చుదామంటే మణులంటే రాళ్ళనే మాట ఉంది. ఆమె ముఖముతో పోల్చడానికి సృష్టిలో ఇంకేమీ లేదు. శివయ్యా! మలహరుడా! నీపై ఒట్టు. ఆ ఇంతి ముఖకాంతి మూడు భువనాలలోకీ నవ్యాతినవ్యమయ్యా.

3-69-క.
చిలుకల కోయిల పలుకుల
వెయంగా టొంకు గలదు వీణెయుఁ దానై
లుకఁగ నేరదు కన్నియ
లుకులతో సాటి యేమి లుకుదుము శివా!

టీక :-
టొంకు = వంకర.
భావము :-
చిలుకల, కోయిల పలుకులు కూతలే కానీ మాటలు కావు. వీణ కూడా తనకు తానుగా పలకలేదు. శివయ్యా! ఆ లలన పలుకులతో సాటి యేమీ లేవయ్యా.

3-70-ఆ.
చెలువ కరము కెంపు చిరుతరారుణ కోమ
లంబు లైన పల్లవంబు లందు
నందమైనయట్టి చెందామరల యందుఁ
లుగనోపుఁగాని లుగ దెందు.

టీక :-
చెలువ = అందమైన స్త్రీ; కరము = చేయి; కెంపు = ఎఱుపు; చిరుత = చిరు, చిన్నదైన; అరుణ = ఇంచుక ఎఱుపు; పల్లవము = చిగురు; చెందామర = ఎఱ్ఱతామర.
భావము :-
ఆ అందగత్తె పార్వతీదేవి చేతుల లేత ఎరుపు, చిగురులయందు, ఎఱ్ఱ తామరలయందు ఉండవచ్చునేమో గాని, మరెందులోనూ కనబడదు.

3-71-సీ.
రుణి చన్నులు భద్రదంతికుంభము లన్న
దంతికుంభుములకుఁ గాంతి లేదు
కొమరాలి కుచములు కోకద్వయము లన్నఁ
గోకంబు లొకచోటఁ గూడకుండు
న్నియచనుదోయి నకకుంభములన్నఁ
నకకుంభములవి రఁగఁబడును
పొలఁతుక పాలిండ్లు వూబంతు లందమా
వూబంతు లంటినఁ బ్రోది మణఁగు.

3-71.1-ఆ.
గానఁ బోల్పఁ దగదు కాంత పయోధర
యుగళమునకు నింక జగములోన
నేమి పోల్పవచ్చు నీశాన! చెప్పవే
ణఁతిఁబొగడవశమె బ్రహ్మకైన.

టీక :-
తరుణి = యవ్వనము గల స్త్రీ; చన్ను = స్తనము; కోకము = చక్రవాకము; ప్రోది = వైభవము, శోభ.
భావము :-
ఆ తరుణి స్తనములు భద్రగజ కుంభములు అందామంటే వాటికి కాంతిలేదు. ఆ కొమరాలి కుచములు చక్రవాకములజంట అందామంటే అవి రెండూ కలిసి ఉండవు. కన్నియ చనుదోయి బంగారు కలశములు అందామంటే అవి కరిగిపోతాయి. పొలతుక పాలిండ్లు పూబంతు లందామంటే అవి శోభను కోల్పోతాయు. అవును ఆ పార్వతీకాంత స్తనములజంట జగత్తులోనే సాటిలేనివి. ఓ ఈశా! పరమేశా! ఆ బ్రహ్మదేవునికైనా ఆ పడతిని పొగడతరము కాదు.

3-72-క.
తెవకుఁ జన్నుల వ్రేఁగున
ఱియల్లల నాడుచున్న ధ్యము వ్రేఁగై
విఱుగునది విఱుగకుండుట
వెఱఁగయ్యెను మాకుఁ జూడ విశ్వాధిపతీ!

టీక :-
తెఱవ = స్త్రీ; వేగు = భారము; మధ్యము = నడుము; వెఱగు = ఆశ్చర్యము.
భావము :-
ఓ విశ్వేశ్వరా! ఆమె చన్నుల భారమునకు అల్లల్లాడుతున్న నడుము భరించలేక విరిగిపోవాలి. విరగకపోవడం చూసి మాకు ఆశ్చర్యమేసింది.

3-73-క.
చెలువకుఁ గేకిసములకును
హంసాధీశునకును జరాజునకున్
వెలఁది నడుచు క్రియ లట్లు
లినడవం దరము గాదు నాగేంద్రధరా!

టీక :-
చెలువ = అందమైన స్త్రీ; కేకి = నెమలి; వెలది = స్త్రీ.
భావము :-
నాగభూషణా! ఈశ్వరా! పార్వతీదేవి నడిచే వయ్యారం అందమైన స్త్రీలకు, నెమళ్ళకు, కలహంసలకు, గజరాజుకు తరం కాదు.

3-74-క.
నామణి యగు పార్వతి
విసితకల్యాణరూపవిభవము చెప్పన్
హర! నీయాన సుమీ
జాసను కైనఁ జనదు చంద్రాభరణా!.

టీక :-
లలన = లాలించు, విలాసవతియైన స్త్రీ; విలసిత = ప్రకాశింపబడిన; కల్యాణ = శుభ; జలజాసనుడు = బ్రహ్మ; చనదు = రాదు, శక్యముకాదు.
భావము :-
చంద్రాభరణా! మలహరా! పరమశివా! నీ మీద ఒట్టు సుమా! పార్వతీదేవి యొక్క మంగళరూప వైభవము చెప్పడానికి బ్రహ్మకైనా సాధ్యంకాదు.

3-75-ఆ.
తివ యిట్టి దట్టి ని చెప్పరా దెందు
దేవదేవుఁ డైన దేవ! నిన్ను
ధిపుఁగాఁగఁ బడసె నంతయ చాలదే
వెలఁదిలక్షణములు వేయు నేల?

టీక :-
అతివ = వ్యు. అతి + వన్నెలు + అ = అతివ. ఎక్కువ మంగళాలంకారములు కలది., పుణ్యస్త్రీ; అధిపుడు = ప్రభువు, భర్త; వెలది = ప్రసన్నమైన స్త్రీ.
భావము :-
దేవా! శివా! ఆమె ఇలాంటిది, అలాంటిది అని ఏ విషయంలోనూ చెప్పలేము. దేవదేవుడైన నిన్నే భర్తగా పొందుతున్నదంటే అది చాలదా? ఆమె లక్షణములు వేయెందుకు చెప్పడం?