పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమాశ్వాసము : దాక్షాయణి దక్షు నింటి కరుగుట

1-123-చ.
నినియమించి శంభుఁడు గణాధిపులన్ బిలిపించి దక్షునం
తన పుట్టినింటికిని న్యత జన్నము జూడఁబోయెడిన్
దికరమండలప్రభల దివ్యవిమానముఁ దెండు రండు పొం
వుడు వారు దెచ్చి రతి హాటకదివ్యవిమానరాజమున్.

టీక :-
నియమించు = ఆజ్ఞాపించు; గణాధిపులు = గణనాయకులు;; ధన్యత = పుణ్యము;; జన్నము = యాగము;; దినకరుడు = సూర్యుడు;; ప్రభ = వెలుగు ;;అనవుడు = అనిన పిమ్మట;; హాటకము = బంగారము..
భావము :-
వెళ్ళిరమ్మని పార్వతికి చెప్పి, శివుడు గణనాయకుల్ని పిలిపించి దాక్షాయణి యజ్ఞము చూడడానికి తన పుట్టినింటికి వెళ్ళాలనుకుంటోంది. సూర్యమండల ప్రకాశంతో ఉండే దివ్య విమానాన్ని తీసుకురమ్మనగా వారు సరేనని బంగారుమయమైన దివ్య విమానాన్ని తీసుకువచ్చారు.

1-124-వ.
అంత నప్పరమేశ్వరియు నమ్మహాదేవునకు వినయ భృతాంతఃరకణ యై సాష్టాంగ దండప్రణామంబు లాచరించి య మ్మహాదేవు ననేక ప్రకారంబుల నుతియించి య ద్దేవు ననుమతంబున నానాసహస్రకోటి తరణికిరణ ప్రభోజ్జ్వలంబై నభోభాగంబు విడంబించు సువర్ణాంచితం బగు దివ్యవిమానంబుఁ బ్రవేశించి యందు సుందర రత్నాంచితాసనాసీన యై యుండు నవసరంబున.

టీక :-
భృత = నింపబడిన; అంతఃకరణ = మనస్సు; సాష్టాంగ దండ ప్రణామము = ఎనిమిది అంగములు (తల, రొమ్ము, చెవులు, కళ్ళు, నోరు, పొట్ట, చేతులు, పాదాలు) నేలను తాకే విధంగా నమస్కరించడం;; ప్రకారము = విధము;; నుతియించి = పొగిడి;; అనుమతము = ఒప్పుకోలు; సహస్రము = వెయ్యి;; తరణి = సూర్యుడు; ప్రభ = వెలుగు;విడంబించు = మించు; ఉజ్జ్వలము = ప్రకాశించు;; నభము = ఆకాశము;; అంచిత = గౌరవింపబడిన.
భావము :-
అప్పుడు పరమేశ్వరి వినయముతో కూడిన మనస్సు కలదై శివునకు సాష్టాంగ నమస్కారము చేసెను. అనేక విధాలుగా ప్రార్ధించి, యతని అనుమతితో పార్వతీదేవి అనంతకోటి సూర్యకిరణాల ప్రభలతో ఆకాశంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ విహరించు బంగారు అలంకారాల దివ్య విమానమునెక్కిరి. అందు అందమైన రత్న సింహాసనంపైఆసీనురాలు అయ్యారు. ఆ సమయంలో.........

1-125-సీ.
"వీణియ నీవు దే వీణాసుభాషిణి!
జిక్కకుండఁ దెండు చెలువ లెల్ల."
రాజహంసికఁ దెమ్ము రాజహంసికయాన!
కీరంబు నీవు దే కీరవాణి!
ణిహారములు దెమ్ము ణిగణాలంకృత!
పువ్వులు నీవు దే పువ్వుఁబోడి!
గంధంబు నీవు దే గంధసింధురయాన!
నకంబు నీవు దే నకవర్ణ!

1-125.1-ఆ.
పొలఁతి యాడు పసిఁడి బొమ్మలు నీవు దే
సిడిబొమ్మఁబోలుడఁతి! మఱియు
లయునట్టి పెక్కు స్తువులెల్లను
జిక్కకుండఁ దెండు చెలువ లెల్ల."

టీక :-
వీణియ = వీణను ; సుభాషిణి = మధురముగా మాట్లాడేదానా, స్త్రీ; మృగనాభి = కస్తూరిని ; మృగని
భావము :-
“వీణలా మాట్లాడేదానా! నీవు వీణను, లేడి కన్నులు కలదానా! నీవు కస్తూరిని, రాజహంసలా నడిచేదానా! నీవు రాజహంసను, చిలుకలా పలికేదానా! నీవు చిలుకను, మణులతో అలంకరింపబడినదానా! నీవు మణులను, పూవువలె సుకుమారమైనదానా! నీవు పువ్వులను, సుగంధముతో కదిలేదానా! నీవు గంధమును, పసిమిచాయగలదానా! నీవు బంగారమును తీసుకొని రా. బంగారు బొమ్మలా ఉండేదానా! నీవు పసిడి బొమ్మలనూ తీసుకురవలసినది. ఇంకా కావలసిన వస్తువులను ఒకదానికొకటి కలసిపోకుండా తీసుకురండి.” అంటూ పార్వతీదేవి చెలికత్తెలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు.

1-126-వ.
ఇవ్విధంబున న మ్మహాదేవి చెలికత్తెలు మొత్తంబులై తమలో బహు ప్రకారంబులఁ బను లేర్పఱిచికొని ప్రమథగణసుందరీ సమేతంబుగా గజకర్ణ లంబోదర సూర్యవర్ణ సోమవర్ణ శతమాయ మహామాయ మహేశ మృత్యుహరాదులు మొదలుగాఁ గల మహా ప్రమథగణంబులు గొలువ దివ్యవిమానారూఢయై యుండె నప్ప డ వ్విమానంబు ముదంబున గడపం దొడంగి రంత నదియును మనోవేగంబున దక్షుని యాగమంటపమ్ముఁ గదిసిన న క్కన్యారత్నంబు తన సఖీజనంబులుం దానును గగనగమనంబు డిగ్గి.

టీక :-
ఇవ్విదంబున = ఈవిధముగా;; బహు = ఎక్కువ ;; ప్రకారము = విధము ;; ఆరూఢము = ఎక్కినది;; మనము = మనస్సు ;; గదియుట = చేరుట ;; సఖులు = చెలులు;; గగనము = ఆకాశము;; గమనము = ప్రయాణసాధనము ;; డిగ్గి = దిగి .
భావము :-
ఈ విధముగా చెలికత్తెలు తమలో తాము పనులు పురమాయించుకుని సిద్ధమైనారు. అప్పుడు ఆ మహాదేవి చెలికత్తెలతోను, ప్రమథగణ సుందరీమణులతోను, గజకర్ణ, లంబోదర, సూర్యవర్ణ, సోమవర్ణ, శతమాయ, మహామాయ, మహేశ, మృత్యుహర మొదలైన మహాప్రమథగణాలతో దివ్యవిమానంలో కొలువుదీర్చి యుండెను. అప్పుడా దివ్యవిమానము మనోవేగముతో దక్షుని యాగమంటపము చేరెను. అప్పుడు దాక్షయణి, తన సఖులతో విమానము దిగి.......

1-127-చ.
లిత మై గణోత్తములు ల్లనిపించు పసిండిదండముల్
లఁగొనఁ బట్టి బిట్టున త్రిన్నుతవల్లభ వచ్చె మీ రహో
లఁగి తొలంగి పాయుఁ డని తాపసు లాదిగ వేల్పు మూకలన్
మున బాయఁ ద్రోయుచును సందడి వాపి గణాళిఁ గొల్వగన్.

టీక :-
సలలితము = అందమైన ;; గణోత్తములు = గణములలో గొప్పవారు ;; ఝల్లనిపించు = భయము చేత వణికించు ;; పసిండి = బంగారము ;; దండము = దుడ్డుకఱ్ఱ ;; కలఁగొన = కలతచెందేలా ;; బిట్టున = వేగముగా ;; త్రిజగ్నుత = త్రిజగన్నుత, ముజ్జగములచే నుతింపబడువాడు, శివుడు ;; వల్లభ = భార్య ;; తలగి = తప్పించు;; తొలంగు = తప్పుకొను ;; పాయుము = తొలగుము ;; తాపసులు = మునులు ;; వేల్పులు = దేవతలు ;; మూకలు = గుంపులు ;; చలమున = అదటున, పట్టుదలతో;; ఆళి = వరుస .
భావము :-
ఆ సలలితములైన గణనాథులు ఝల్లుమనిపించే బంగారు చేతి కర్రలతో “శంకరి వస్తున్నారు. పక్కకుండండి.మీరు జరగండి.” అంటూ తాపసులు, దేవతలు మొదలైనవారిని నియంత్రిస్తూ,సందడి చేస్తూ, కొలుస్తుండగా.....

1-128-సీ.
వేదండగమనలు వింజామరలు వీవ;
కాళి నడచె యాగశాలకడకు.
లలితరంభోరువు ల్వెలిగొడుగులు పట్ట;
సైకతజఘనలు న్నుతింప;
రిరాజసమమధ్య లంకించి పాడంగఁ;
రికుంభకుచలు మంళము నుడువ;
మలబాహులతలు ళ్యాణములువాడ;
రాజనిభాస్యలు మణఁ గొలువ;

1-128.1-ఆ.
లోల మీనభృంగలోచన ధమ్మిల్ల
తులు గొంద ఱతులతుల నడువ;
ల్లిదండ్రి చెలుల ర్శింప నమ్మహా
కాళి నడచె యాగశాలకడకు.

టీక :-
వేదండము = గమనలు = ఏనుగు వలె నడచువారు, అందగత్తెలు;; వింజామర = విసనికఱ్ఱ ;; వీవ = విసరగా;; పల్లవము = లేతచిగురు వంటి;; అంఘ్రి = కాళ్ళుకలవారు;; వేడ్క = కుతూహలము ;;బలసి = పరివేష్టించి, చుట్టూచేరి ;; లలిత =మనోజ్ఞమైన ;; రంభోరువులు = అరటి కంబముల వంటి తొడలు గలవారు, సుందీమణులు ;; వెలి = తెల్లని;; సైకతజఘనములు = ఇసుకతిన్నెల వంటి పిరుదులు కలవారు;; సన్నుతించు = పొగడు ;; హరి రాజ సమ మధ్యలు = సింహరాజము నకు సాటి వచ్చు నడుములు కలవారు, అందగత్తెలు;; అంకించి = పొగుడుతూ ;; కరికుంభకుచలు = ఏనుగు కుంభస్థలము వంటి పాలిండ్లు కలవారు, సౌందర్యవతులు ;; మంగళము = శుభము, భద్రవాక్యములు;; కమలబాహులతలు = కమలముల వలె తీగలు వంటి బాహువులు కలవారు, సుందరీమణులు; కళ్యాణములు = శుభములు ;; వాడ = పలుక;; రాజనిభాస్యలు = చందునితో సాటివచ్చు ముఖములు కలవారు, చంద్రముఖులు;; రమణన్ = ఒప్పిదముగా.లోల = కదలునది ;; మీనము = చేప;; భృంగము = తుమ్మెద;; లోచన = కన్నులు;; ధమ్మిల్లము = కొప్పు ;; అతుల = మిక్కిలి ఆందమైన ;; గతి = విధము; మహాకాళి = పార్వతీదేవి.
భావము :-
గజగమనలు వింజామరలు విసురుచుండగా, చిగురులు వంటి పాదములు గల చెలులు చూట్టూచేరి నడుస్తుండగా, మనోహరమైన అరటికంబముల వంటి తొడలు గల చెలులుతెల్ల ఛత్రములు పట్టగా, ఇసుకతిన్నెలవంటి పిరుదులు గల చెలులు కీర్తించుచుండగా, సింహము వంటి నడుములు గల చెలులు స్తోత్రములుగానం చేస్తుండగా, గజకుంభములవంటి కుచములు గల చెలులు మంగళములు పలుకగా, కమలకాండములవంటి బాహులతలు గల చెలులు శుభములు పలుకగా, చంద్రముఖులు చేరి మనోహరముగా కొలుస్తుండగా.చేపలవంటి కన్నులు కలవారు, తుమ్మెద రెక్కలవలె నల్లనైన కొప్పులు గల అందగత్తెలు సేవిస్తూ వెంట నడువగా; తల్లిదండ్రులను, స్నేహితురాళ్ళను చూచుటకై ఆ పార్వతీదేవి యాగశాలవద్దకు వెళ్ళెను. గమనిక: - రాబోయే ఉగ్రతను సూచించడానికి మహాకాళి అను నామం వాడారు.

1-129-వ.
ఇట్లు నడచి.
భావము :-
అలా వెళ్ళి....

1-130-మ.
హేమోన్నత యాగమంపముపైఁ గళ్యాణి నిల్చుండఁగాఁ
నియుం గానని యట్ల వోయెఁదగు సత్కారంబులం దేమిటన్
నితం దల్పకపోయె తొల్లిటి వృథావైరంబుతో బూజలన్
నిపెం గూఁతుల నల్లురన్ దివిజులన్ దక్షుండు దక్షాత్ముఁ డై.

టీక :-
ఘనము = గొప్పదైన;; హేమము = బంగారము ;; ఉన్నత = ఎత్తైన ;; సత్కారము = మర్యాద ;; తొల్లిటి = పాత, ముందటి ;; వృధా = వ్యర్థమైన ;; వైరము = శతృత్వము ;; దివిజులు = దేవతలు.
భావము :-
ఎత్తైన గొప్ప బంగారు యాగమండపముపై దాక్షాయణి నిలబడింది. దక్షుడు చూసీ చూడనట్లు మెలగసాగాడు. పూర్వపు వృధా వైరముతో ఆ కళ్యాణికి చేయవలసిన సత్కారముల గురించి పట్టించుకోలేదు. తక్కిన కూతుళ్ళను, అల్లుళ్ళను, దేవతలను మాత్రం సత్కరిస్తున్నాడు.

దక్షుఁడు దాక్షాయణిం దిరస్కరించుట